జనసేన, టీడీపీది చీకటి ఒప్పందం : వైసీపీలోకి జీవిత రాజశేఖర్

  • Published By: vamsi ,Published On : April 1, 2019 / 04:56 AM IST
జనసేన, టీడీపీది చీకటి ఒప్పందం : వైసీపీలోకి జీవిత రాజశేఖర్

Updated On : April 1, 2019 / 4:56 AM IST

వైసీపీలోకి టాలీవుడ్ ప్రముఖుల చేరికలు కొనసాగుతూ ఉన్నాయి. నటుడు రాజశేఖర్, జీవితలు సోమవారం (01 ఏప్రిల్ 2019)న హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలిసి, ఆయన సమక్షంలో వైసీపీలో చేరారు. జీవిత, రాజశేఖర్‌లకు పార్టీ కండువా కప్పి జగన్ సాదరంగా పార్టీలికి ఆహ్వానించడం జరిగింది. ఈ సంధర్భంగా మాట్లాడిన రాజశేఖర్..  వైసీపీలో చేరడం ఆనందగా ఉందని.. తిరిగి సొంతగూటికి వచ్చినట్లు ఉందని అన్నారు. పది రోజులు కష్టపడి జగన్ ముఖ్యమంత్రి అయ్యేందకు కృషి చేస్తామని వెల్లడించారు.

వైఎస్ రాజశే్ర్ రెడ్డి బిడ్డ వైఎస్ జగన్ పులి బిడ్డ అని,  చంద్రబాబు గారి తర్వాత ముఖ్యమంత్రిగా మారిన రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. నాయుడు గారికి చాన్స్‌లు ఇచ్చామని, టీడీపీ ఇప్పుడు దిగజారిపోయిందని, ఫ్యామిలీ పాలిటిక్స్ ఎక్కువయ్యాయని ఆరోపించారు. నాయుడా? జగనా? అంటే జగన్‌కే ఓటు వేయాలని అన్నారు. ఏపీలో తిరిగి ప్రచారం చేస్తానని, ఏపీ అభివృద్ది చెందాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని రాజశేఖర్ అన్నారు. గతంలో జగన్‌తో విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని.. ఆ ఘటనలను మరిచిపోయినట్లు చెప్పారు.

గతంలో చూసిన జగన్ వేరు.. ఇప్పుడు ఉన్న జగన్ వేరని అన్నారు. యంగ్ బ్లడ్‌లో ఉన్న జగన్ ప్రజలకు న్యాయం చేస్తారని అన్నారు. ఒక పార్టీ స్థాపించి, అండర్ గ్రౌండ్‌లో రెండో పార్టీతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్న నేతలను తిప్పుకొట్టాలంటూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి ప్రస్తావించారు. రెండు పార్టీలు దొంగల్లాగా విడివిడిగా ఉన్నట్లు నటిస్తూ లోపల ఒక్కటిగా ఉన్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చే డబ్బులు, చీరలకు ఆశపడొద్దని ఓటర్లకు సూచించారు.