ఆ గోల మాకొద్దు : NTR బాటలో చరణ్, బన్నీ

స్టార్ హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇద్దరూ ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఫాలో అయిపోతున్నారు. తారక్ అడుగుజాడల్లో నడుస్తూ.. కాంట్రవర్సీలకు దూరంగా ఉండేందుకు డిసైడ్ అయ్యారు. ఇంతకీ.. బన్నీ, చెర్రీ ఏ విషయంలో తారక్ ని ఫాలో అవుతున్నారో చూదామా..?
టాలీవుడ్ స్టార్ హీరోలంతా.. పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నారు. ఫ్యామిలీ మెంబర్సే పొలిటిషియన్స్ గా ఉన్నా కూడా.. ఎన్నికల ప్రచారానికి దూరం. ఎన్టీఆర్.. అప్పట్లో పాలిటిక్స్ లో చక్రం తిప్పాలనుకున్నా.. తర్వాత వెనక్కి తగ్గాడు. రీసెంట్ గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అక్క సుహాసిని పోటీ చేసినా ప్రచారానికి వెళ్లలేదు ఎన్టీఆర్. ఇప్పుడు కూడా టీడీపీ తరపున ప్రచారం చేసే అవకాశం ఉన్నా.. అటువైపు అస్సలు చూడటం లేదు. కారణం కాంట్రవర్సీలకు దూరంగా ఉండాలి అనుకోవడమే. దీనికితోడు ప్రస్తుతం సినిమాలపై తప్ప మరే విషయాలపై ఎన్టీఆర్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
ఇక రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా ఎన్టీఆర్ నే ఫాలో అయిపోతున్నారు. జనసేన పార్టీ పెట్టి కంప్లీట్ గా పాలిటిక్స్ లోకి దిగిన మెగా ఫ్యామిలీ హీరో పవన్ కళ్యాణ్ కి.. సపోర్టింగ్ గా ఎన్నికల్లో ప్రచారం చేస్తామని గతంలోనే చెర్రీ, బన్నీ పలు ఈవెంట్స్ లో చెప్పారు. ప్రజెంట్ సిచ్చుయేషన్ ని బట్టి చూస్తే.. ఈ ఇద్దరు హీరోలు కూడా క్యాంపెయిన్ కి వెళ్లే ఛాన్స్ లేదు. ఎందుకంటే.. చరణ్ RRR షూటింగ్ కోసం వడోదరా వెళ్లాడు. అల్లు అర్జున్.. త్రివిక్రమ్ సినిమా కోసం మేకోవర్ అవుతున్నాడు. సో..ఇలాంటి టైంలో ప్రచారంలో పాల్గొని.. లేనిపోని వివాదాల్లో చిక్కుకుంటే.. అసలుకే మోసం వస్తుంది. అందుకే ప్రచారానికి వెళ్లకపోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. ఇలా ముగ్గురు స్టార్ హీరోలు నో పొలిటిక్స్ ఓన్లీ సినిమా అంటున్నారు.