పల్లెటూరిలో రేవ్ పార్టీ : 300ల మంది యువకుల చిందులు..అరెస్ట్  

  • Published By: veegamteam ,Published On : May 11, 2019 / 06:50 AM IST
పల్లెటూరిలో రేవ్ పార్టీ : 300ల మంది యువకుల చిందులు..అరెస్ట్  

Updated On : May 11, 2019 / 6:50 AM IST

రేవ్ పార్టీ సంస్కృతి పట్నం నుంచి పల్లెలక్కూడా పాకింది. పశ్చిమగోదావరి జిల్లాలో పెనుమంట్ర మండలం మార్టేరు     రేవ్ పార్టీలో మద్యం తాగిన వందలాదిమంది యువకులు చిందులేశారు.  కోణాల మాణిక్యం కల్యాణ మండపంలో ఈ రేవ్ పార్టీ జరగింది. యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తు యువకులు ఫుల్ గా తాగిన యువకులు చిందులేశారు. 

పుట్టిన రోజు వేడుకల  ముసుగులో రేవుపార్టీ తరహాలో మద్యం సేవించిన 300ల మంది యువకులు వైజాగ్ నుంచి తీసుకొచ్చిన నలగురు యువతులతో  అర్దనగ్న నృత్యాలు చేయిస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు  అర్దరాత్రి పోలీసుల దాడి చేశారు. అనంతరం యువకులతో పాటు నలుగురు యువతులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా కళ్యాణమండపం నిర్వాహకులు చైతన్య రెడ్డికి కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.