RCBvsMI:’బెంగ’ళూరు తీరు లేదు..

ముంబైతో సొంతగడ్డపై జరిగిన పోరులో బెంగళూరు ఆఖరి వరకూ పోరాడినా విజయం దక్కించుకోలేకపోయింది. 188 పరుగుల టార్గెట్ చేధించే దిశగా బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి వరకూ మిస్టర్ 360 డివిలియర్స్ క్రీజులో ఉండి షాట్లు కురిపించినప్పటికీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు.
చేధనలో దూకుడు ప్రదర్శించాలని కలలుకన్న బెంగళూరు డివిలియర్స్ మినహాయించి చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. డివిలియర్స్(70; 41 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సులు), విరాట్ కోహ్లీ(46; 32 బంతుల్లో), పార్థివ్ పటేల్(31; 22బంతుల్లో), మొయిన్ అలీ(13), షిమ్రోన్(5), గ్రాండ్ హోమ్(2), శివం దూబె(9)పరుగులు చేయగలిగారు.
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఓపెనర్లు క్వింటన్ డికాక్(23: 20 బంతుల్లో), రోహిత్ శర్మ(48; 33 బంతుల్లో) దూకుడుతో ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తే ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్(38; 24 బంతుల్లో), యువరాజ్ సింగ్(23; 12 బంతుల్లో) పరవాలేదనిపించారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన కీరన్ పొలార్డ్(5), కృనాల్ పాండ్యా(1), మిచెల్ మెక్‌నగన్(1), మయాంక్ మార్కండే(6), హార్దిక్ పాండ్యా(32), బుమ్రా(1)కు మాత్రమే పరిమితమైయ్యారు.
బెంగళూరు బౌలర్లు చాహల్(4)వికెట్లు పడగొట్టగా, ఉమేశ్ యాదవ్(2), మొహమ్మద్ సిరాజ్(2) వికెట్లు తీయగలిగారు.
WE WINNNN!!!!!!!!!!!!!#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #RCBvMI pic.twitter.com/gBPzjbDBxG
— Mumbai Indians (@mipaltan) March 28, 2019