కరీంనగర్‌లో రెడ్ అలర్ట్ , కరోనా పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం కేసిఆర్

కరీంనగర్ లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు . నగరంలోని పలు ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. ఇండోనేషియా దేశస్ధులు తిరిగిన ముఖరాంపురా, కశ్మీర్ గడ్డ, భగత్ నగర్ ను రెడ్ జోన్ గా ప్రకటించిన అధికారులు ఆ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేసి నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. బయటవారు లోపలికి, లోపలి వారు బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.
కరీంనగర్ జగిత్యాల రహదారిపై ఆరు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన అధికారులు కరీంనగర్ వైపు ఎవరూ రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అక్కడి అధికారులతోమాట్లాడిన సీఎం కేసీఆర్ నిబంధనలు కఠినంగా అమలు చేయమని ఆదేశించారు. రెడ్ జోన్ ఏరియాలోని అనుమానితులను ఆస్పత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు.
కరీంనగర్ లో కరోనా పాజిటివ్ కేసు బయట పడటంతో సీఎం కేసీఆర్ కరీంనగర్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇండోనేషియన్ దేశస్ధులు సంచరించిన ప్రదేశాలకు 100 వైద్య బృందాలను పంపి అనమానితులకు పరీక్షలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రధ్ధ తీసుకుని అధికారులతో మాట్లాడుతూ రక్షణ చర్యలు పై సమీక్షిస్తున్నారు. బయట ఊళ్ళనుంచి కూడా ఎవరూ కరీంనగర్ రాకుండా…అక్కడి వారు బయటకు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు చర్యలు తీవ్రతరం చేశారు.
See Also | మణిపూర్ లో తొలి కరోనా కేసు