తప్పిన ప్రమాదం : కరెంట్ పోల్ ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
నల్గొండ జిల్లాలో APSRTC బస్సుకు ప్రమాదం తృటిలో తప్పింది. వేములపల్లి మండలం శెట్టిపాలెం దగ్గర కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి పంటపొలంలో బోల్తా పడింది. ఈ ఘటనలో

నల్గొండ జిల్లాలో APSRTC బస్సుకు ప్రమాదం తృటిలో తప్పింది. వేములపల్లి మండలం శెట్టిపాలెం దగ్గర కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి పంటపొలంలో బోల్తా పడింది. ఈ ఘటనలో
నల్గొండ జిల్లాలో APSRTC బస్సుకు ప్రమాదం తృటిలో తప్పింది. వేములపల్లి మండలం శెట్టిపాలెం దగ్గర కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి పంటపొలంలో బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. డ్రైవర్ నిద్రమత్తే దీనికి కారణమని భావిస్తున్నారు.
అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై ఆర్టీసీ బస్సు అదుపుతప్పింది. ఈ బస్సు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల డిపోకు చెందినది. హైదరాబాద్ నుంచి పిడుగురాళ్ల వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఊహించని ప్రమాదంతో ప్రయాణికులు షాక్ తిన్నారు. భయాందోళనకు గురయ్యారు. ఒక వేళ కరెంట్ షాక్ కొట్టి ఉంటే ఊహకందని ఘోరం జరిగి ఉండేదన్నారు. రంగంలోకి దిగిన అధికారులు స్థానికుల సాయంతో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.