క్లారిటీ ఇచ్చేశారు : పార్టీ మారను – జగ్గారెడ్డి

  • Published By: madhu ,Published On : April 22, 2019 / 07:32 AM IST
క్లారిటీ ఇచ్చేశారు : పార్టీ మారను – జగ్గారెడ్డి

Updated On : April 22, 2019 / 7:32 AM IST

పార్టీ మారుతున్న వస్తున్న వార్తలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారే యోచన లేదని చెప్పుకొచ్చారు. అయితే పార్టీ మారేది మాత్రం కాలం నిర్ణయిస్తుందని వేదాంత ధోరణిలో తెలిపారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కల మినహా అందర్నీ టీఆర్ఎస్ ఆశ్రయిస్తోందని తెలిపారు. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటర్ బోర్డులో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై స్పందించారు. ఇందులో అవకతవకలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకోకుండా విద్యార్థులకు సీఎం కేసీఆర్ భరోసా ఇవ్వాలన్నారు. 

జగ్గారెడ్డి..కాంగ్రెస్ లీడర్. ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ వేడిని రగిలిస్తుంటారు ఈ లీడర్. టీఆర్ఎస్, కేసీఆర్ పాలన అంటే ఒంటి కాలిపై లేస్తారు. అలాంటి ఈ నాయకుడు గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్‌పై తీవ్రమైన విమర్శలు చేసిన జగ్గారెడ్డి..పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దీనితో ఆయన పార్టీ మారడం పక్కా అంటూ డిసైడ్ అయిపోయారు కొందరు నేతలు.

రైతులకు మద్దతు ధర విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించారు. ఇది ఒకవేళ అమలయితే..రైతుల పక్షాన కేసీఆర్‌కి గుడి కట్టిస్తానంటూ ప్రకటించారు. మరోసారి ఆయన పార్టీ మారే విషయం చర్చకు వచ్చింది. తాజాగా పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో TRS విజయదుందుభి మ్రోగించింది. కానీ సంగారెడ్డిలో మాత్రం కాంగ్రెస్ గెలిచింది. అయితే..ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు గులాబీ కండువా కప్పేసుకుంటున్నారు.