సినీ వలసలు: వైసీపీలోకి మరో సీనియర్ యాక్టర్

  • Published By: vamsi ,Published On : March 13, 2019 / 04:10 AM IST
సినీ వలసలు: వైసీపీలోకి మరో సీనియర్ యాక్టర్

సినిమా ఇండస్ట్రీ నుండి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సినిమావాళ్లు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే పోసాని కృష్ణ మురళీ, పృద్వీ రాజ్, కృష్ణుడు, అలీ… ఇలా వరుసగా ఆ పార్టీలో చేరగా.. ఇప్పుడు మరో ప్రముఖ నటుడు ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. సీనియర్ నటుడు రాజా రవీంద్ర ఇవాళ(13 మార్చి 2019) వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. . ఆయనతో పాటు మరికొంతమంది నాయకులు, పారిశ్రామిక వేత్తలు కూడా వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు చెబుతున్నారు.

అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్, కాకినాడ టీడీపీ ఎంపీ తోట నరసింహం అతని భార్య, టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది. పొట్లూరి వరప్రసాద్ విజయవాడ ఎంపీగా పోటీ చేయనుండగా.. మాగుంటకు ఒంగోలు సీటు దక్కే అవకాశం ఉంది. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వీరంతా వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. పార్టీలోకి వస్తున్న వారిని ఆహ్వానిస్తూ, లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్న జగన్.. నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.