చిత్తూరు: కుటుంబాలను వెలివేసి..ఇళ్ల చుట్టూ ఇనుప కంచె కట్టేసిన నెర్నపల్లి గ్రామ పెద్దలు

  • Published By: veegamteam ,Published On : February 20, 2020 / 09:12 AM IST
చిత్తూరు: కుటుంబాలను వెలివేసి..ఇళ్ల చుట్టూ ఇనుప కంచె కట్టేసిన నెర్నపల్లి గ్రామ పెద్దలు

Updated On : February 20, 2020 / 9:12 AM IST

తాము కోరిన భూమి ఇవ్వలేదని గ్రామంలోని ఆరు ఉమ్మడి కుటుంబాలను పెద్దలు వెలివేశారు. అక్కడితో ఊరుకోలేదు. వారి ఇళ్ల చుట్టూ ఇనుమ కంచెలు కట్టేశారు. ఆ కంచె దాటి వాళ్లు బైటకు రాకూడదని ఆంక్షలు పెట్టారు. సభ్యసమాజం తలవంచుకునే ఈ దారుణ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా వి.కోట మండలం నెర్నెపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. నెర్నెపల్లి గ్రామ పెద్దలు చేసిన ఈ నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిది. బహిష్కరించిన కుటుంబాలకు చెందిన వ్యక్తులతో  గ్రామస్తులు మాట్లాడితే రూ.5వేలు జరిమానా కట్టాలని హుకుం జారీ చేశారు.దీంతో  బాధిత కుటుంబాలు పలు ఇబ్బులు పడుతున్నారు.

వివరాల్లోకి వెళితే..ఎగువ చౌడేపల్లి గ్రామంలో ఓ దేవాలయానికి సమీపంలో ఉన్న భూమి ఇవ్వాలని గ్రామ పెద్దలు కొన్ని కుటుంబాలను అడిగారు. దానికి వాళ్లు అంగీకరించలేదు. దానికి పంచాయితీ పెద్దలు ఆరు ఉమ్మడి కుటుంబాలకు వెలివేశారు. బాధిత ఇళ్ల చుట్టూ ఇనుప కంచె కట్టేశారు.

రాతి దిమ్మల్ని పాతి వాటికి ఇనుక తీగలు కట్టారు.  వారితో ఎవ్వరూ మాట్లాడకూడదని…వాళ్ల ఇంటికి ఎవ్వరూ వెళ్లకూడదనీ..అలా చేసినవారికి రూ.5వేలు జరిమానా కట్టాలని హెచ్చరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత కుటుంబ సభ్యులు వి.కోట మండల తహశీల్దార్ ను ఆశ్రయించారు.

దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన తహశీల్దారు గ్రామ పెద్దలను పిలిచి మాట్లాడారు. బాధిత కుటుంబాలకు..గ్రామ పెద్దలకు మధ్య రాజీకుదిర్చారు. ఇకపై ఇటువంటి ఘటనలు జరిగితే ఊరుకునేది లేదని కళిన చర్యలు తీసుకుంటామని గ్రామ పెద్దలను హెచ్చరించారు.  బాధిత కుటుంబాల చుట్టూ వేసిన ఇనుప కంచెలను తొలగించివేశారు తహశీల్దారు మురళీధర్.