సూర్యపేట జిల్లా ఎస్పీ బదిలీ

సూర్యపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లుపై బదిలీ వేటు పడింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల క్రమంలో ఎన్నికల సంఘం బదిలీ చేసింది.

  • Published By: veegamteam ,Published On : October 4, 2019 / 01:17 PM IST
సూర్యపేట జిల్లా ఎస్పీ బదిలీ

Updated On : October 4, 2019 / 1:17 PM IST

సూర్యపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లుపై బదిలీ వేటు పడింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల క్రమంలో ఎన్నికల సంఘం బదిలీ చేసింది.

సూర్యపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లుపై బదిలీ వేటు పడింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల క్రమంలో ఎన్నికల సంఘం ఎస్పీని బదిలీ చేసింది. ఉప ఎన్నికల క్రమంలో పలు ఆరోపణల రావడంతో ఈసీ బదిలీ చేసింది. హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ఎటువంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని ఆదేశించారు. ఆయన స్థానంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న 2012 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన భాస్కరన్ నియమించారు. 

దీనిపై మొదటి నుంచి బీజేపీ, కాంగ్రెస్ తోపాటు అన్ని విపక్షాలు పోలీసులు మొత్తం కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నాయి. నిన్న బీజేపీ తెలంగాణకు సంబంధించిన నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఎస్పీతోపాటు పలువురిని బదిలీ చేయాలని..ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని వినతి పత్రం సమర్పించారు.

ఈ క్రమంలోనే మరుసటి రోజైన శుక్రవారం (అక్టోబర్ 4, 2019) ఎస్పీ వెంకటేశ్వర్లును బదిలీ చేస్తూ విధులను తగ్గించారు. హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ఎటువంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఉప ఎన్నికల క్రమంలో మొదటి నుంచి బీజేపీ, కాంగ్రెస్ ఒక ఎస్పీపైనే కాకుండా ఇతర అధికారులు కాకుండా హుజూర్ నగర్ సర్కిల్ కు సంబంధించిన డీఎస్ పీ, ఇతర సీఐలపై ఆరోపణలు చేస్తున్న క్రమంలో ఎస్పీ బదిలీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే సీఐలు, డీఎస్పీపై చర్యలు ఉంటాయన్న చర్చ కూడా కొనుసాగుతోంది.