అర్ధరాత్రి విడుదల : TDP రెండో జాబితా

TDP తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. శాసనసభ బరిలో దిగుతున్న మరో 15మందిని ప్రకటించింది. ఈసారి ఏడుగురు సిట్టింగ్‌లకు ఛాన్స్ ఇచ్చారు బాబు. మరో ఇద్దరు వారసులకు టికెట్లు కేటాయించారు. శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లోని అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అధినేత.. మరో 35 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే 126 అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
మార్చి 16వ తేదీ శనివారం అర్ధరాత్రి రెండో జాబితాను ప్రకటించారు. ఈ లిస్ట్‌లో 15 మందికి టికెట్ కేటాయించారు. రెండు జాబితాలలో కలిపి ఓసీలకు 78, బీసీలకు 35, ఎస్సీ ఎస్టీలకు 27 సీట్లు దక్కాయి. ఇందులో తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న వారి సంఖ్య 23. ఇంకా ప్రకటించాల్సిన అభ్యర్థుల సంఖ్య 35కి పెరిగింది. 25మంది పార్లమెంట్ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మొత్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు టీడీపీ మరో 60మంది ఖరారు చేయాల్సి ఉంది.
నియోజకవర్గం | అభ్యర్థి పేరు |
పాలకొండ | నిమ్మక్ జయకృష్ణ |
రంపచోడవరం | వంతల రాజేశ్వరీ |
పామర్రు | ఉప్పులేటి కల్పన |
నందికొట్కూరు | బండి జయరాజు |
పిఠాపురం | ఎస్వీఎస్ఎన్ వర్మ |
ఉంగటూరు | గన్ని వీరాంజనేయులు |
పెడన | కాగిత వెంకటకృష్ణ ప్రసాద్ |
చిత్తూరు | ఏఎస్ మనోహర్ |
మడకశిర | కె.ఈరన్న |
సూళ్లూరి పేట | పర్సా వెంకటరత్నం |
బనగాపల్లి | బీసీ జనార్ధన్ రెడ్డి |
ఉరవకొండ | పయ్యావుల కేశవ్ |
రాయదుర్గం | కాలా శ్రీనివాసులు |
మదనపల్లి | దమ్మలపాటి రమేశ్ |