అకౌంట్లలో రోజుమార్చిరోజు డబ్బులు : ఖుషీ ఖుషీగా ఏపీ ప్రజలు

  • Published By: vamsi ,Published On : April 3, 2019 / 08:01 AM IST
అకౌంట్లలో రోజుమార్చిరోజు డబ్బులు : ఖుషీ ఖుషీగా ఏపీ ప్రజలు

Updated On : April 3, 2019 / 8:01 AM IST

అకౌంట్ లో డబ్బులు పడ్డాయి అనే మెసేజ్ రాగానే ముఖాలు వెలిగిపోతాయి. నెలకు ఓసారి కష్టానికి పడే జీతం వస్తేనే అదే తుత్తి. అలాంటిది ఊరికి బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి అంటే ఇంకెంత ఖుషీగా ఉంటుందో చెప్పండి. ఇలాంటి ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్తుతం ఏపీ జనం. రాబోయే వారం రోజుల్లో వరసగా పడనున్న డబ్బులతో ముఖాలు వెలిగిపోతున్నాయి. ఎప్పుడెప్పుడు పడతాయా అని వెయిట్ చేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ ఇచ్చే డబ్బులు ఇవి.

ఏప్రిల్ 4వ తేదీ : పసుపు-కుంకుమ డబ్బు (ఒక్కో మహిళ ఖాతాలో రూ.4వేలు)
ఏప్రిల్ 6వ తేదీ : రైతు రుణ మాఫీ (మాఫీ కింద మిగిలిన మొత్తం జమ)
ఏప్రిల్ 8వ తేదీ : అన్నదాత సుఖీభవ (ఒక్కో రైతు ఖాతాలో రూ.3వేలు)

ఈ విధంగా రోజుమార్చి రోజు బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడుతుంటే.. ఆ కిక్కే వేరప్పా అంటున్నారు. ఏప్రిల్ 4వ తేదీ అంటే మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. దీనికితోడు ఎన్నికల ప్రచారం హడావిడి. పండగే పండగ అంటున్నారు. 

సాంఘిక సంక్షేమ పింఛన్ల కింద ఇచ్చే మొత్తాన్ని రెట్టింపు చేసి ఇస్తున్న చంద్రబాబు జనవరి నుంచి  రూ.2వేలను ఇస్తున్నాడు ఇది ఏప్రిల్ నెలలో 1వ తేదీన వృద్దులకు ఇస్తున్నారు. ఒకవేళ మళ్లీ గెలిస్తే ఈ పించన్‌ను రూ.3వేలు చేస్తానంటూ చంద్రబాబు హమీ ఇచ్చారు. 

అలాగే తన మానస పుత్రికగా చెప్పుకునే డ్వాక్రా సంఘాలు పసుపు-కుంకుమ పేరుతో చెక్కులను ఇస్తున్న చంద్రబాబు. రెండవ విడత చెక్కులను ఇప్పటికే పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.2500 ఫిబ్రవరిలో.. 3,500 మార్చిలో పడగా.. రూ.4000 ఏప్రిల్ 4వ తేదీన పడనున్నాయి. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు పసుపు కుంకుమ కార్యక్రమం చేపట్టినట్లు చంద్రబాబు చెప్పారు. 98 లక్షల డ్వాక్రా మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. 

ఇక అన్నదాత సుఖీభవ కింద మొత్తం 1,349కోట్లు విడుదల చేశారు. 44లక్షల 99వేల 843మంది రైతుల ఖాతాల్లో జమ కానుంది. ఒక్కో రైతుకు రూ.3వేలు పడనున్నాయి.