తూర్పుగోదావరిలో టీడీపీకి షాక్ : వైసీపీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే

  • Published By: vamsi ,Published On : March 23, 2019 / 07:29 AM IST
తూర్పుగోదావరిలో టీడీపీకి షాక్ : వైసీపీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే

Updated On : March 23, 2019 / 7:29 AM IST

తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ముందు షాక్‌ తగులుతుంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పలువురు పార్టీలు మారగా.. తాజాగా పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. పి.గన్నవరం టిక్కెట్ ఇవ్వలేదనే కోపంతో ఉన్న నారాయణమూర్తి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు.

తెలుగుదేశం టిక్కెట్‌ను ఈసారి  నెలపూడి స్టాలిన్ బాబుకు టీడీపీ కేటాయించింది. పిఠాపురం బహిరంగ సభలో నారాయణ మూర్తి పార్టీ మారనున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు ఆయనను బుజ్జగించే చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే నివాసానికి నామన రాంబాబు, అభ్యర్థి స్థాలిన్‌బాబుతోపాటు వెళ్లి కలిశారు.

రాబోయే రోజుల్లో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి ఇప్పిస్తామని నచ్చజెప్పారు. ఇదే విషయాన్ని నేడు కాకినాడ వస్తున్న సీఎం చంద్రబాబుతో హామీ ఇప్పిస్తామని నామన బుజ్జిగించారు. అయినా కూడా నారాయణ వినట్లేదని చెబుతున్నారు నేతలు. పార్టీ మారేందుకే నారాయణమూర్తి సిద్ధపడినట్లు క్యాడర్ అంటోంది. కీలకమైన ఈ సమయంలో ఇలా పార్టీ మారటం బాగుండదని.. ఎన్నికల వరకు వేచిచూడాలని టీడీపీ నేతలు బుజ్జగిస్తున్నారు. 
Read Also : ఎన్నికలకు మరో ఇరవై రోజులే : మేనిఫెస్టో రిలీజ్ చేయని టీడీపీ, వైసీపీ