వివేక హత్య : నేనే చేశానని రుజువైతే నడిరోడ్డుపై కాల్చేయండి

పులివెందుల : మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి మృతి ఘటనలో తనపై వస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు పులివెందుల టీడీపీ అభ్యర్థి సతీష్ రెడ్డి. ఆరోపణలు రుజువైతే తనను నడి రోడ్డుపై కాల్చి చంపండి అంటూ వైసీపీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి సవాల్ విసిరారు సతీష్ రెడ్డి. వివేక మృతిని కూడా వైసీపీ నీచ రాజకీయాలకు వాడుకుంటుందని.. తనపై వచ్చిన ఆరోపణలకు ఎటువంటి విచారణకైనా సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. వివేకానందరెడ్డిది సాధారణ మృతి కాదనీ.. హత్యేనని.. దీని వెనక మంత్రి ఆదినారాయణరెడ్డి, సతీశ్ రెడ్డి హస్తం ఉందని వైసీపీ ఎమ్మెల్యే రవీంధ్రనాథ్ రెడ్డి ఆరోపించిన క్రమంలో సతీశ్ రెడ్డి ఈ విధంగా స్పందించారు.
Read Also: కత్తితో నరికారు : వివేకానందరెడ్డిని చంపేశారు
సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ తో పాటు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. పులివెందులలో వైసీపీ పరాభవం తప్పదని.. వైసీపీకి వినాశకాలం దాపురించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆరోపణలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా మృతిపై అసలు వాస్తవాలు త్వరలోనే బైటపడతాయనీ.. ఇలాంటి ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని సతీశ్ సూచించారు. వైఎస్ కుటుంబంలో ఉన్న అంతర్గత కలహాల వల్లనే వివేక మృతికి కారణమంటూ విమర్శించారయన. సిగ్గు శరం లేకుండా జగన్ వ్యవహరిస్తున్నారనీ.. గతంతో వివేక తండ్రి రాజారెడ్డి మరణం విషయంలో తనపై కేసు పెట్టారని సతీశ్ రెడ్డి గుర్తు చేశారు. వైసీపీ నేతలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని.. ఇది సరైంది కాదని సతీశ్ రెడ్డి సూచించారు.