ప్రకాశం రచ్చ : వల్లూరమ్మ గుడిలో దామచర్ల – బాలినేని వర్గాల ఘర్షణ

ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. నామినేషన్ వేసేముందు వైసీపీ వాళ్లు, టీడీపీ వాళ్లు ఒంగోలులోని వల్లూరు గ్రామంలోని వల్లూరమ్మ టెంపుల్ లోకి వెళ్లగా అక్కడ రెండు పార్టీల కార్యకర్తలు తోసుకోవడంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు.
Read Also : సొంతమామనే కుట్రచేసి చంపిన వ్యక్తి చంద్రబాబు : జగన్
ఒంగోలు పట్టణంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గతంలో కమ్మపాలెంలో కూడా ఘర్షణ చోటుచేసుకున్నది. వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెళ్లిన సంధర్భంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అయితే తరచు ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్న పరిస్థితిలో పోలీసులు కలక్టరేట్ వద్ద 144 సెక్షన్ విధించారు.
Read Also : ఎన్నికల టైంలో ఐటీ రైడ్స్ ఎలా చేస్తారు : ఈసీకి శివాజీ కంప్లయింట్