ఆలీ చూపు ఎటు : పవన్‌ను కలిసిన ఆలీ…

  • Published By: madhu ,Published On : January 6, 2019 / 07:26 AM IST
ఆలీ చూపు ఎటు : పవన్‌ను కలిసిన ఆలీ…

Updated On : January 6, 2019 / 7:26 AM IST

విజయవాడ : సినీ నటుడు, కమెడియన్ ఆలీ పొలిటికల్ ఎంట్రీపై ఉత్కంఠ నెలకొంటోంది. అయిన ఏ పార్టీలో చేరుతారనే దానిపై సస్పెన్ష్ నెలకొంది. సినిమా రిలీజ్ కంటే ముందు…ట్రైలర్ చూపించినట్లుగా ఆలీ వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరిగింది. దానికంటే ముందుగానే జగన్‌ని ఆలీ కూడా కలవడం..వారిద్దరి మధ్య పార్టీ చేరిక అంశం చర్చకు వచ్చినట్లు టాక్ వినిపించింది. సో..ఆయన పక్కా వైఎస్ఆర్‌ కాంగ్రెస్ వైపే అంటూ చర్చ జరిగింది. ఆయన ఎంతగానే అభిమానించే పవన్ పెట్టిన జనసేన పార్టీ కాదని..ఇతర పార్టీ వైపు మొగ్గు చూపే ఆస్కారం లేదని కొంతమంది వాదిస్తున్నారు. 
ఇదిలా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి ఆలీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. జనవరి 06వ తేదీ ఆదివారం మధ్యాహ్నం వీరిద్దరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఆలీని జనసేనలోకి పవన్ ఆహ్వానించినట్లు..దీనికి ఆలోచిస్తానని ఆలీ చెప్పినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే జగన్‌ను కలిసిన అలీ జనవరి 9వ తేదీన వైసీపీలో చేరుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పవన్‌ను  అలీ కలవడం పలు సందేహాలకు తావిస్తోంది. మరి ఆలీ జనసేన వైపా..వైసీపీ వైపా అనేది చూడాలి.