చుక్కల భూములపై చుక్కలు : ఏపీ సర్కార్‌కి గవర్నర్ షాక్

  • Published By: madhu ,Published On : January 30, 2019 / 06:32 AM IST
చుక్కల భూములపై చుక్కలు : ఏపీ సర్కార్‌కి గవర్నర్ షాక్

Updated On : January 30, 2019 / 6:32 AM IST

విజయవాడ : ఏపీ ప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ షాక్ ఇచ్చారు. చుక్కల భూముల ఆర్డినెన్స్‌ని తిప్పి పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆర్డినెన్స్‌కు జారీకి ఆస్కారం లేదన్నారు. దరఖాస్తుల పరిష్కారానికి రెండు నెలలు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 

జనవరి 6వ తేదీన అసెంబ్లీలో బిల్లు పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చుక్కల భూములు క్రమబద్దీకరణ…22 ఏ నిషేధిత భూమలు జాబితా అప్‌డేట్..వీటిపై ప్రజల నుండి ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిని పరిష్కరించాలని అనుకుని ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. చుక్కల భూములపై హక్కులు కల్పించాలని ప్రభుత్వం యోచించి…గతేడాది ఏప్రిల్ నెలలో చుక్కల భూముల చట్టం తీసుకొచ్చింది. తాజాగా గవర్నర్ ఆమోదం ఇవ్వకపోవడంతో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.