చంద్రబాబు పాలనలో దేవాలయాలకు రక్షణ లేదు: విజయసాయి రెడ్డి

సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. దేవాలయాల ఆస్తులన్నీ అడ్డగోలుగా దోచుకుంటున్నారని విమర్శించారు. టీటీడీలో తవ్వకాలు..కిరీటాల దొంగతనాలు..వంటి పలు అంశాలను పరిశీలిస్తే దేవాలయాల రక్షణ ఎలా ఉందో అర్థం అవుతోందన్నారు. టీటీడీలో తవ్వకాలు ఎందుకు చేపట్టారు? ఆ గుప్త నిధులన్నీ ఎక్కడకు తరలించబడ్డాయి? ఆ తవ్వకాలను ఎందుకు గోప్యంగా ఉంచారో చెప్పాలని విజయసాయి డిమాండ్ చేశారు.
టీటీపీ పాలనలో దేవాయలయాల ఆస్తులన్నీ దొంగలపాలవుతున్నాయని మొదటి నుంచి తాను చెబుతునే ఉన్నామని తిరుపతి దేవస్థానంతో పాటు గోవిందరాజులు దేవస్థానంలో కూడా రెండు కిరీటాలు దొంగిలించబడ్డాయన్నారు. ఈ కేసుల్లో విచారణ చేపట్టిన పోలీస్ అధికారులకు దొంగిలించబడిన కిరీటాలు ఎక్కడుతున్నాయో తెలుసనీ ..దొంగిలించిన వ్యక్తుల గురించికూడా తెలుసని వారి ఇళ్లలో సోదాలు చేపడితే కచ్చితంగా అవి దొరుకుతాయని విజయసాయిరెడ్డి అన్నారు. అంతే తప్ప చిల్లర దొంగతనాలు చేసేవారిని పట్టుకుని వారే దొంగలుగా మభ్యపెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. టీడీపీ పాలనలో జరిగేవన్నీ అరాచకాలేనన్నారు.
సదావర్తి భూములను ఎందుకు అమ్మాల్సి వచ్చిందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. విజయవాడలో 40 దేవాలను కూలగొట్టారని వాటిని ఎందుకు కూల్చాల్సిన అవసరమేంటో చెప్పాలనీ ..తిరిగి వాటిని పునర్నిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారనీ కాని ఇంత వరకూ ఒక్క దేవాలయాన్ని కూడా నిర్మించలేదన్నారు. పలు చర్చిలను. మసీదులను కూడా చంద్రబాబు పాలన కూలగొట్టారనీ..వీటిని కూడా నిర్మిస్తామన్న చంద్రబాబు వాటి ఊసే ఎత్తటంలేదని విమర్శించారు. కృష్టా, గోదావరి పుష్కరాలకు వందల కోట్లు ఖర్చుపెట్టారని కానీ ఎటువంటి మౌలిక వసతుల్ని కల్పించలేదని విజయసాయిరెడ్డి చంద్రబాబుపై విమర్శకులు కురిపించారు.
తమకు అనుకూలంగా ఉండే సీఎస్ లనే చంద్రబాబు నియమించుకుంటు దోపిడీకి పాల్పడుతున్నాడని విమర్శించారు. వీటిని గమనించి వ్యతిరేకించే సీఎస్ లను తొలగిస్తున్నారనీ ఈ క్రమంలో సీఎల్ ఎల్వీ సుబ్రహ్మణ్యం గారిని పక్కన పెట్టి పునేటాను సీఎస్ గా ఏపీ ప్రభుత్వం నియమించుకుందనీ కానీ ఎన్నికల కమిషన్ చొరవతో పునేటాను తొలగించి తిరిగి సుబ్రహ్మణ్యంని నియమించిందని దీన్ని చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారనీ విజయసాయి రెడ్డి తెలిపారు. చంద్రబాబు పరిపాలనలో ఐదు సీఎస్ లు పనిచేయగా వారిలో ముగ్గురు సీఎస్ లు బాబు పని తీరును తీవ్రంగా తప్పు పట్టారని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ క్రమంలో సీఎం సుబ్రహ్మణ్యం ఓ విచారణాధికారిని బాబు పనితీరుపై నియమించారనీ విచారణ పూర్తయింది కానీ ఆ నివేదికను ఇంకా వెల్లడించలేదు. ఆ నివేదిక బైటపెట్టాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.