రోడ్డెక్కిన మహిళలు : జగనన్నా..ఆడబిడ్డల ఆక్రోశం అర్థం చేసుకోవా..

  • Published By: veegamteam ,Published On : December 19, 2019 / 04:53 AM IST
రోడ్డెక్కిన మహిళలు : జగనన్నా..ఆడబిడ్డల ఆక్రోశం అర్థం చేసుకోవా..

Updated On : December 19, 2019 / 4:53 AM IST

జగనన్నా..రాష్ట్రంలోని ఆడబిడ్డల ఆక్రోశాన్ని అర్థం చేసుకోవా? ఇదే నీ పాలన..ఇదేనా ఓట్లు వేసి నిన్ను ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు నువ్వు ఇచ్చే ప్రతిఫలం అంటూ ఏపీ ఆడబిడ్డలు సీఎం జగన్ ను ప్రశ్నిస్తున్నారు. ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ అసెంబ్లీ ఆఖరి రోజు సమావేశంలో సీఎం జగన్ చేసిన ప్రకటన ఏపీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంట్లోంచి బైటకు రాని ఆడవారు సైతం రోడ్డెక్కారు. తుళ్లూరు, గొల్లపల్లిలో రైతులతో పాటు మహిళలకు కూడా రోడ్లపైకి వచ్చి రాస్తారోకో నిర్వహించారు. సీఎం జగన్ ను ప్రశ్నిస్తున్నారు. 

ముఖ్యంగా రాజధాని ప్రాంతంలోని రైతులు..మహిళలు సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆక్రోశాన్ని వెళ్లగ్రక్కుతున్నారు. ఆవేదనతో ఏందన్నా ఈ ప్రకటనలు..ఇలా ఇష్టమొచ్చిన నిర్ణయాలు తీసుకుని ప్రజలను గందరగోళంలో పడేసి వేడుక చూస్తున్నావు అంటూ ఆగ్రహం వెళ్లగ్రక్కుతున్నారు. నీ ఇష్టమొచ్చినట్లుగా చేసి..రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే ఓట్లు వేసి నిన్ను గెలిపించిన ప్రజలు చూస్తు ఊరుకోరు అంటే హెచ్చరిస్తున్నారు.

మాకు రాజధాని ఇక్కడే కావాలి.. అది అమరావతి అయు ఉండాలి. అంతే తప్ప రాష్ట్రానికి మూడు ఆరు రాజధానులు అవసరం లేదని.. తాము ఎవరిని ఉద్ధేశించి మాట్లాడటంలేదనీ మా రాష్ట్రానికి సీఎంగా ఉన్న నువ్వు ప్రజల అభిప్రాయాలను..ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత నీపై ఉంది కాబట్టి..ఇటువంటి నిర్ణయాలతో ప్రజల్ని మనోవేదనకు గురిచేస్తే ఫలితం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. తాము ఎవరిని బాధ పెట్టటానికి ఇలా అనటం లేదనీ..ఆడబిడ్డల్ని..రైతన్నలను ఆవేదనకు గురి చేసే ఏ ప్రభుత్వాలు నిలవని సీఎం జగన్ గుర్తు పెట్టుకోవాలని..తక్షణ ఏపీకి మూడు రాజధానుల ప్రకటనను విరమించుకోవాలని ఏపీ ఆడబిడ్డలు డిమాండ్ చేస్తున్నారు.