కడప వాగులో కొట్టుకుపోయిన ఆటో: మూడు మృతదేహాలు లభ్యం

  • Published By: veegamteam ,Published On : September 19, 2019 / 10:08 AM IST
కడప వాగులో కొట్టుకుపోయిన ఆటో: మూడు మృతదేహాలు లభ్యం

Updated On : September 19, 2019 / 10:08 AM IST

కడప జిల్లాలో పొద్దుటూరు కామనూరువంక వాగులో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మూడు రోజుల క్రితం ఆరుగురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యల్లో భాగంగా ఇప్పటివరకూ మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురు ఆచూకీ లభించాల్సి ఉంది. 

కడప జిల్లాలో భారీగా కురిసిన వర్షాలకు ఓ ఆటో కామనూరువంక వాగు వరద నీటిలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కొట్టుకుపోయారు. వీరిలో మేఘన,అంజలి, సుబ్బమ్మల మృతదేహాలు లభ్యంకాగా.. రామాంజనేయులు,పెంచలమ్మ, కార్తీక్ ల ఆచూకీ దొరకాల్సి ఉంది. 

తమ కళ్లముందే రామాంజనేయులు కుటుంబం అంతా ఆటోతో సహా కొట్టుకుపోయారనీ..అలా నీటి ఉధృతికి కొట్టుకుపోయిన వారు అందుబాటులో ఉన్న చెట్ల కొమ్మల్ని పట్టుకుని రక్షించమంటూ వేడుకున్నారు.తమ పోలీస్ బృందం వారిని రక్షించేందుకు తాము ఎంతా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందనీ ప్రొద్దుటూరు డీఎస్పీ సుధాకర్ అన్నారు. కొద్దిసేపు కొట్ల కొమ్మల్ని పట్టుకుని ఉన్నవారిని ఎలాగైనా రక్షిద్దామని ప్రయత్నించాం..కానీ నీటి ఉదృతి పెరగటంతో వారు తమ కళ్లముందే కొట్టుకుపోయారనీ సుధాకర్ తెలిపారు. ప్రత్యేక బృందాలతో వారి ఆచూకీ కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశామని తెలిపారు.