29మందితో టీటీడీ ధర్మకర్తల మండలి రెడీ
టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పాటుకు సర్వం సిధ్ధమైంది. బోర్డులో సభ్యుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డినెన్స్కు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం సెప్టెంబర్ 12న ఆమోదం తెలిపారు.

ప్రస్తుతం టీటీడీలో ఉన్న ధర్మకర్తల మండలిలోని 15 మంది సభ్యులకు అదనంగా మరో 10 మంది సభ్యులను ప్రభుత్వం పెంచింది. వీరు కాక మరో నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 29 మందితో కొత్త బోర్డు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే చైర్మన్ నియామకం జరిగిపోయినందున మిగిలిన 24 మంది నియామకంపై సెప్టెంబర్ 13 శుక్ర, 14వతేదీ శనివారాల్లో ఉత్తర్వలు జారీ కానున్నాయి. బోర్డులో కొత్తగా నియమించే సభ్యులకు ఇప్పటికే మౌఖికంగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
కాగా ప్రభుత్వం శుక్రవారం సెప్టెంబర్ 13న ధర్మకర్తల మండలిలో సభ్యులను నియమించి, ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వీరంతా శనివారం సెప్టెంబర్ 14న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సమావేశం నిర్వహించనున్నట్లు అధికార వర్గాల సమాచారం.