కరోనా కష్టాల్లో కళాకారులు : ఆన్ లైన్ లో రాఖీలు అమ్ముకుంటున్న టీవీ నటి

  • Published By: nagamani ,Published On : July 23, 2020 / 02:47 PM IST
కరోనా కష్టాల్లో కళాకారులు : ఆన్ లైన్ లో రాఖీలు అమ్ముకుంటున్న టీవీ నటి

Updated On : July 23, 2020 / 3:05 PM IST

‘సాథ్ నిభానా సాథియా’ హిందీ సీరియల్ జాతీయస్థాయిలో ప్రసారమైంది. ఈ సీరియల్ ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ అనే పేరుతో తెలుగులో కూడా ప్రసారమై విశేషమైన ఆదరణ పొందింది. కరోనా కష్టాలతో ఈ సీరియల్ లో నటించిన వందన విత్లానీ ఇప్పుడు రాఖీలు అమ్ముకుంటోంది. ఈ సీరియల్ లో కీలకపాత్రలో నటించిన వందన విత్లానీ కరోనా పరిస్థితుల్లో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వటంతో ఆన్ లైన్ లో రాఖీలు అమ్ముతోంది.

వందన విత్లానీ కొంతకాలం క్రితం ‘హమారీ బహు సిల్క్’ సీరియల్ లో నటించింది. కానీ ఆ సీరియల్ నిర్మాత వందనకు డబ్బులు ఇవ్వలేదట. ఈకరోనా కష్టాల్లో కూడా ఆ డబ్బు చేతికి అందకపోవటంతో కరోనా కష్టాల్లో చిక్కుకున్నానని వాపోతోంది వందన విత్లాని.

లాక్ డౌన్ వల్ల షూటింగులు ఆగిపోవటంతో తన డబ్బంతా ఖర్చైపోయిందని..దీంతో వేరే దారిలేక తనకు తెలిసిన విధంగా రాఖీలు తయారుచేస్తూ వాటిని ఆన్ లైన్ ఆర్డర్ల ద్వారా అమ్ముతున్నానని చెబుతోంది.ఇప్పుడు వాటిపై వచ్చే కొద్దిపాటి ఆదాయమే తనకు ఆధారమని వందన తెలిపింది. వందన భర్త విపుల్ కూడా టీవీ నటుడే. కానీ చెప్పేదేముంది అతను కూడా లాక్ డౌన్ పరిస్థితుల్లో ఉపాధి లేక ఇంటికే పరిమితమైన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె రాఖీలు తయారు చేసిన ఆన్ లైన్ లో అమ్ముతోంది.