వివాహేతర సంబంధం..జంట హత్యలు :బెయిల్ పై విడుదలైన అన్నదమ్ముల్ని నరికి చంపిన దుండగులు

నల్లగొండ జిల్లాలో అనుముల మండలం హజారి గూడెంలో అన్నదమ్ముల దారుణ హత్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఓ కేసు విషయంలో బైయిల్ పై విడుదలైన ముగ్గురు అన్నదమ్ములు విడుదలయ్యారు. అదే కేసుపై రేపు అంటూ మంగళవారం(ఆగస్టు 4,2020)న కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి బైట నిద్రస్తున్న సమయంలో జానపాటి సత్యనారాయణ, అంజి అనే ఇద్దరు అన్నదమ్ములను గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపేశారు. వివాహేతర సంబంధం ఇటువంటి దారుణహత్యలకు దారితీసినట్లుగా తెలుస్తోంది.
అన్నదమ్ములు జానపాటి సత్యనారాయణ, జానపాటిలను తమ ఇంటి బయట నిద్రిస్తుండగా గుర్తుతెలియని ఐదుగురు వ్యక్తులు వేట కొడవళ్ల నరికి చంపారు. మరో తమ్ముడు హరి వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు. సరిగ్గా ఏడాది క్రితం చిన్న తమ్ముడు హరి భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్న నేపథ్యంలో రోహిత్ అనే యువకుడి హత్యకు గురయ్యాడు. ఆ కేసులో ఈ ముగ్గురు సోదరులు జైలుకి వెళ్లి వచ్చారు. ఇటీవలే వారు బెయిల్ పై విడుదలయ్యారు.రేపు ఈ కేసు విషయంపై కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇద్దరు అన్నదమ్ములు దారుణ హత్యకు గురయ్యారు. మూడో సోదరుడు హరి పైనా దాడి జరుగగా…తృటిలో తప్పించుకున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రత్యర్థులే వీరిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.