ఇటీవలి మ్యాచ్‌ల్లో అంపైర్ల నిర్లక్ష్యాలివే..

ఇటీవలి మ్యాచ్‌ల్లో అంపైర్ల నిర్లక్ష్యాలివే..

Updated On : March 29, 2019 / 11:08 AM IST

చిన్నస్వామి స్టేడియం వేదికగా లసిత్ మలింగ్ వేసిన బంతిని నో బాల్‌గా ప్రకటించకుండా ఊరకుండిపోయాడు అంపైర్ ఎస్ రవి. దాంతో అంపైర్‍‌పై పెద్ద రచ్చే జరిగింది. విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం కళ్లు తెరుచుకుని ఉండాలంటూ ఐపీఎల్ స్థాయేంటో తెలుకొమ్మని తిట్టిపోశాడు. ఎస్ రవినే కాదు.. ఇటీవల జరుగుతున్న మ్యాచ్‌లలో అంపైర్ల నిర్లక్ష్యం సర్వసాధారణమైపోయిన మ్యాచ్‌ల గురించి ఓ సారి పరిశీలిస్తే.. 

ఇషాంత్ నో బాల్: 
అడిలైడ్ వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియాల మధ్య తొలి టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 16నో బాల్స్‌ను అంపైర్లు పట్టించుకోకుండా వదిలేశారు. ఇందులో టీమిండియా క్రికెటర్ ఇషాంత్ శర్మ వేసిన బాల్ స్పష్టంగా నో బాల్ అని కనిపిస్తున్నా.. దానిని ప్రకటించకపోవడం అంపైర్ నిర్లక్ష్యానికి నిదర్శనం. 

శ్రీలంక స్పిన్నర్ విసిరిన నో బాల్:
 ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక చివరి సారిగా జరిగిన మ్యాచ్‌లోనూ అంపైర్ ఎస్ రవినే తప్పుగా ప్రకటించాడు. శ్రీ లంక స్పిన్నర్ లక్షన్ సండకన్ బౌలింగ్ చర్చనీయాంశంగా మారింది. 

బుమ్రా వైడ్‌లు పసిగట్టలేకపోయారు:

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ముంబై ఇండియన్స్ మధ్య మార్చి 28 గురువారం జరిగిన మ్యాచ్‌లో బుమ్రా విసిరిన వైడ్ లను గుర్తించలేకపోయారు. ఉత్కంఠభరితంగా మారిన ఇన్నింగ్స్‌లో డివిలియర్స్ బాదుడుకి 19వ ఓవర్ కీలకంగా మారింది. ఆ పరిస్థితుల్లో బౌలింగ్ తీసుకున్న బుమ్రా గ్రాండ్ హోమ్‌కు విసిరిన బంతి స్పష్టంగా వైడ్ గా కనిపిస్తున్నా ఫీల్డ్ అంపైర్లు పట్టించకోకపోవడం విచారకరం.

పాట్ కమిన్స్ వివాదస్పద క్యాచ్:

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా నాలుగో వన్డేలో పాట్ కమిన్స్ క్యాచ్ వివాదస్పదంగా మారింది. యుజ్వేంద్ర చాహల్ కొట్టిన షాట్‌ను కమిన్స్ క్యాచ్ పట్టి అవుట్ ఇవ్వాలని కోరాడు. వెంటనే అంపైర్ దానిని అవుట్ ఇవ్వడంతో టీమిండియా అప్పీల్ కోరింది. థర్డ్ అంపైర్ పరిశీలించి అది నాటౌట్‌ అని కనిపిస్తున్నా.. అవుట్‌గా ఇచ్చేశారు.