స్వర్ణ ప్యాలెస్ పై నోరు మెదపలేదు, అంతర్వేదిపై వెంటనే స్పందించారు, బాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు

  • Published By: murthy ,Published On : September 8, 2020 / 06:55 PM IST
స్వర్ణ ప్యాలెస్ పై నోరు మెదపలేదు, అంతర్వేదిపై వెంటనే స్పందించారు, బాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు

Updated On : September 8, 2020 / 7:25 PM IST

Vijayasai Reddy tweets: మళ్లీ ట్వీట్ లతో బాబుపై విరుచుకుపడ్డారు విజయసాయి రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పక్షపాత బుద్ధి ఇటీవలి కాలంలో వెంట వెంటనే బయట పడుతోందన్నారు అన్నారు.

అంతర్వేదిలో రధం దగ్దం ఘటనపై చంద్రబాబు ట్వీట్ చేయడాన్ని విజయసాయిరెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. అంతర్వేదిలో రధం కాలిపోతే ఆఘమేఘాల మీద చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారని….విజయవాడ స్వర్ణా ప్యాలెస్ అగ్నిప్రమాదంలో 10 మంది అమాయకులు ప్రాణాలుపోయినప్పడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి ట్వీట్ కు మద్దతుగా నెటిజన్లు చంద్రబాబు విధానాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.