Viral Video: సలసల కాగుతున్న నూనెలో చేపను వేసి.. షాక్ అయిన వ్యక్తి
చేపను ఫ్రై చేసుకుని తిందామనుకున్నాడు ఓ వ్యక్తి. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. ప్యాన్ లో నూనె పోసి, సలసల కాగించి అందులో చేపను వేశాడు. అయితే, చనిపోయిందనుకున్న చేప.. వేడివేడి నూనెలో వేశాక పెనుగులాడింది. అటూ ఇటూ కదలసాగింది.

Viral Video
Viral Video: చేపను ఫ్రై చేసుకుని తిందామనుకున్నాడు ఓ వ్యక్తి. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. ప్యాన్ లో నూనె పోసి, సలసల కాగించి అందులో చేపను వేశాడు. అయితే, చనిపోయిందనుకున్న చేప.. వేడివేడి నూనెలో వేశాక పెనుగులాడింది. అటూ ఇటూ కదలసాగింది.
ఊహించని పరిణామానికి ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. ఆ చేపను వేసిన ప్యాన్ ను స్టౌ మీది నుంచి తీసి సింక్ వద్దకు తీసుకెళ్లాడు. చేప తన చావును అంగీకరించట్లేదంటూ ఈ వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పోస్ట్ చేసిన కొన్ని గంట్లోనే వేలాది వ్యూస్ వచ్చాయి.
చేప చనిపోయిందని అతడు అనుకున్నాడని, అయితే, చచ్చి మళ్ళీ బతికి వచ్చిందని కొందరు నెటిజన్లు సెటైర్లు వేశారు. ఇకపై చేపకూర వండే సమయంలో తాను జాగ్రత్తగా ఉంటానని ఓ వ్యక్తి పేర్కొన్నాడు. వేడి నూనెలో వేయగానే చేప కదిలిన తీరును చూసి తాను షాక్ అయ్యానని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఆ చేప ఆయుష్షు ఇంకా ఉందని అన్నాడు.
Viral Video: పులి వెనుక పరిగెడుతూ మొబైల్‌లో వీడియో తీసిన వ్యక్తి