పంచాయతీరాజ్ శాఖలో పనులు నిలిపివేత

  • Published By: chvmurthy ,Published On : September 17, 2019 / 09:56 AM IST
పంచాయతీరాజ్ శాఖలో పనులు నిలిపివేత

Updated On : September 17, 2019 / 9:56 AM IST

ఏపీ లో  సీఎం జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా మంజూరై , పనులు మొదలు పెట్టని వాటిని నిలిపి వేసింది. సుమారు వెయ్యి కోట్ల విలువైన పలు రహాదారి పనులను నిలిపివేశారు.

ఈ మేరకు రూ.1031.17 కోట్ల విలువైన పనులను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ రాజ్ ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద అనుమతి పొందిన పనులను నిలిపివేసినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3, 543 పనులను నిలిపి వేస్తున్నట్లు జీవోలో పేర్కోన్నారు.  

2018 ఏప్రిల్ 1 కు ముందు అనుమతి పొందినప్పటికీ పనులు ఇంకా ప్రారంభించకపోవటంతో వాటిని నిలిపి వేసినట్లు అధికారులు తెలిపారు.