డిగ్రీలో 4 మార్కుల క్వశ్చన్ : తెలుగుదేశం పార్టీ గురించి రాయండి

అనంతపురంలో విచిత్రం చోటు చేసుకుంది. కాలేజీ యాజమాన్యం ఓవరాక్షన్ వెలుగు చూసింది. ఆర్ట్స్ కాలేజీలో బీఏ విద్యార్థులకు విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. పొలిటికల్ సైన్స్ క్వశ్చన్

  • Published By: veegamteam ,Published On : March 26, 2019 / 08:42 AM IST
డిగ్రీలో 4 మార్కుల క్వశ్చన్ : తెలుగుదేశం పార్టీ గురించి రాయండి

Updated On : March 26, 2019 / 8:42 AM IST

అనంతపురంలో విచిత్రం చోటు చేసుకుంది. కాలేజీ యాజమాన్యం ఓవరాక్షన్ వెలుగు చూసింది. ఆర్ట్స్ కాలేజీలో బీఏ విద్యార్థులకు విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. పొలిటికల్ సైన్స్ క్వశ్చన్

అనంతపురంలో విచిత్రం చోటు చేసుకుంది. కాలేజీ యాజమాన్యం ఓవరాక్షన్ వెలుగు చూసింది. ఆర్ట్స్ కాలేజీలో బీఏ విద్యార్థులకు విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. పొలిటికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ లో తెలుగుదేశం పార్టీ గురించి రాయాలన్న ప్రశ్న ఇచ్చారు. ఇది చూసి విద్యార్థులు షాక్ తిన్నారు. ఓ రాజకీయ పార్టీ గురించి రాయమనడం ఏంటి? అని క్వశ్చన్ చేస్తున్నారు. బీఏ సెకండ్ ఇయర్, నాలుగో సెమిస్టర్ ప్రశ్నాపత్రంలో 8 అంశాలను ఇచ్చారు. అందులో ఏవైనా 5 ప్రశ్నలకు సమాధానం రాయాలని చెబుతూ, ఒక్కో ప్రశ్నకు 4 మార్కులను ఇచ్చింది వర్శిటీ. బాధ్యతాయుత ప్రభుత్వం, భారత ఉప రాష్ట్రపతి, మంత్రిమండలి, సంకీర్ణ ప్రభుత్వం, ద్విశాసన సభ, ఎన్నికల సంస్కరణలు, తెలుగుదేశం పార్టీ, పార్టీ ఫిరాయింపుల చట్టం… అంశాలను ఇస్తూ, అందులో 5 ఎంచుకోవాలని కోరింది. ఆర్ట్స్ కాలేజీకి అటానమస్ హోదా ఉంది. దీంతో కాలేజీ సొంతంగా ప్రశ్నాపత్రాలు తయారు చేసుకుంటుంది.

టీడీపీ గురించి రాయమని ప్రశ్న ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, ఇలా ఓ పార్టీ గురించి రాయాలనడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని చెబుతున్నారు. పలువురు విద్యార్థులు క్వశ్చన్ పేపర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ నిరసన తెలిపారు. దీనిపై కాలేజీ యాజమాన్యం స్పందించింది. క్వశ్చన్ పేపర్ తాము తయారు చేయలేదని, మరో వర్సిటీ నుంచి వచ్చిందని వివరణ ఇచ్చారు.