నూజివీడు ట్రిపుల్ IT ఉమెన్స్ హాస్టల్ రూమ్‌లో యువకుడు: ఎందుకొచ్చాడు? ఏం చేస్తున్నాడు?

  • Published By: veegamteam ,Published On : February 22, 2020 / 10:49 AM IST
నూజివీడు ట్రిపుల్ IT ఉమెన్స్ హాస్టల్ రూమ్‌లో యువకుడు: ఎందుకొచ్చాడు? ఏం చేస్తున్నాడు?

Updated On : February 22, 2020 / 10:49 AM IST

కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో భద్రతా లోపాలు బైటపడ్డాయి. ట్రిపుల్ ఐటీ ఉమెన్స్ కాలేజీ హాస్టల్ లోకి ఓ దుండగుడు ప్రవేశించాడు. ఈ విషయం సెక్యూరిటీలు కూడా పసిగట్టలేకపోయారు. అలా రహస్యంగా హాస్టల్ లోకి ప్రవేశించిన సదరు యవకుడు ఒకరోజంతా హాస్టల్ లోనే ఉన్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే..నూజివీడు ట్రిపుల్ ఐటీ ఎప్పుడూ వివాదాస్పదమైన ఘటనతో వార్తల్లోకి వస్తుంటుంది. ఇప్పుడు ఉమెన్స్ హాస్టల్ లోకి ఓ యువకుడు వచ్చి ఒకరోజంతా హాస్టల్ రూమ్ లోనే గడపటాన్ని ఎవ్వరూ గుర్తించకపోవటం మరో వివాదానికి కారణంగా తయారైంది. అలా హాస్టల్ లోని ఓ రూమ్ లోకి ప్రవేశించిన సదరు యువకుడు ఓ మంచం కింద దాక్కున్నాడు. ఈ విషయాన్ని రెండు రోజుల తరువాత గమనించిన విద్యార్ధినులు అతన్ని పట్టుకుని సెక్యూరిటీకి తెలిపారు. సెక్యూరిటీ నిఘా ఎంతగా ఉంది అనే విషయాలు వివాదాస్పదంగా మారాయి.

కాగా నూజివీడు పట్టనానికి దూరంగా ఉండే ఈ ట్రిపుల్ ఐటీ కాలేజ్..హాస్టల్ నిత్యం వివాదం కొనసాగుతున్నాయి. ఏదోక ఘటనలతో తరచూ వివాదాలు నెలకొంటున్నాయి. విద్యార్ధులు కొట్టుకోవటం..కొన్ని ఘటనలో విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవటం సర్వసాధారణంగా జరుగుతున్నాయి. కానీ విద్యాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీసీ గానీ, రిజిస్టర్ గానీ అస్సలు పట్టించుకోవటంలేదు.  ఈ క్రమంలో సదరు యువకుడిని పట్టుకున్న విద్యార్దినులు సెక్యూరిటీకి అప్పగించటంతో వారు పోలీసులకు అప్పగించారు.   

ఆ యువకుడు ఎవరు? ఎందుకొచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? సెక్యూరిటీ కళ్లు కప్పి హాస్టల్ లోకి ఎలా వచ్చాడు? నిఘా లోపాలు ఎలా ఉన్నాయి? దీనికి సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటంలేదు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Read More>>దర్శకుడు శ్రీవాస్‌కి మాతృవియోగం