అందరికి చెప్పండి : రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యం
కర్నూలు : రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యం అని అందరికి చెప్పాలని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి

కర్నూలు : రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యం అని అందరికి చెప్పాలని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి
కర్నూలు : రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యం అని అందరికి చెప్పాలని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15వేలు ఇస్తామన్నారు. ఉన్నత చదువులకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఏడారికి రూ.75వేలు ఇస్తామన్నారు. మే నెలలో ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద రూ.12వేల 500 ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా నంద్యాలలో వైసీపీ ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడారు.
అగ్రిగోల్డ్ ఆస్తులను సీఎం చంద్రబాబు, ఆయన బినామీలు దోచేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. కేశవరెడ్డి బాధితులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులు న్యాయం కోసం చంద్రబాబు చుట్టూ తిరుగుతూనే ఉన్నారని జగన్ వాపోయారు. బాబు వస్తే జాబు వస్తుందని అన్నారు.. కానీ బాబు వచ్చాడు జాబులు ఊడగొట్టాడు అని జగన్ విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు తగ్గాయి, నిరుద్యోగులు రెట్టింపయ్యారని జగన్ చెప్పారు.
చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాలు బలహీనపడ్డాయన్నారు. ఆరోగ్యశ్రీ కాస్తా అనారోగ్యం పాలైందన్నారు. జన్మభూమి కమిటీలు మాఫియాల్లా తయారయ్యాయని జగన్ ఆరోపించారు. చంద్రబాబు పాలన మొత్తం మోసమే అని విరుచుకుపడ్డారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబుకి నంద్యాల మీద ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. నంద్యాలలో లెక్కలేనన్ని శంకుస్థాపనలు చేశారని.. రోడ్డు విస్తరణలో నష్టపోయిన వారికి ఇంతవరకు నష్టపరిహారం అందలేదని జగన్ చెప్పారు.
బాబు పాలనలో మహిళలకు భద్రత కరువైందని జగన్ అన్నారు. ఎమ్మార్వోపై దాడి చేస్తే చర్యలు లేవన్నారు. విజయవాడలో కాల్ మనీ నడిపిన టీడీపీ నాయకులను శిక్షించలేని అసమర్థుడు చంద్రబాబు అని జగన్ మండిపడ్డారు. ఈ ఎన్నికలు ధర్మానికి-అధర్మానికి మధ్య జరుగుతున్నాయని జగన్ అన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది చంద్రబాబు అనేక కుట్రలు చేస్తారని, ప్రతి గ్రామానికి డబ్బుల మూటలు పంపిస్తారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దని ప్రజలను కోరారు.