గవర్నర్‌ను కలిసిన జగన్: టీడీపీపై ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిశారు. జగన్ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి వర్గం మంగళవారం(ఏప్రిల్ 16) ఉదయం 11గంటల ప్రాంతంలో గవర్నర్‌ను హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో కలిశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిపై వైఎస్ జగన్ గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. పోలింగ్ ముగిశాక తమ పార్టీ వారిపై, తమకు ఓట్లేసిన సాధారణ ప్రజలపై టీడీపీ వర్గీయులు దాడులకు దిగుతున్నారని జగన్ ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రంలో టీడీపీ పాలన తీరును గవర్నర్ దృష్టికి జగన్ తీసుకుని వెళ్లనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Read Also : హైదరాబాద్‌లో లోన్ మోసం: నమ్మారో బ్యాంకులో మొత్తం నొక్కేస్తారు