3648 కి.మీ. విజయయాత్ర : బాబు కొత్త డ్రామా

శ్రీకాకుళం : ఏపీ రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఉన్నా..వర్షాభావ పరిస్థితులున్నా బాబు..జాతీయ రాజకీయాలంటూ కొత్త డ్రామా మొదలు పెట్టిన బాబు…హెలికాప్టర్‌లో చక్కర్లు కొడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఎద్దేవా చేశారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా పాతబస్టాండులో భారీ బహిరంగసభ నిర్వహించింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు.
అనంతపురంలో కరవు ఉన్నా బాబు పట్టించుకోరని..కానీ కర్నాటకకు వెళ్లి కుమారస్వామితో కాఫీ తాగుతాడని…మళ్లీ విమానం ఎక్కి చెన్నైకి వెళ్లి ఇడ్లీ..సాంబార్ బాబు తింటాడని…చిత్తూరును మాత్రం పట్టించుకోరని విమర్శించారు. అంతే ఆగకుండా కోల్ కతాకు వెళ్లి మమత బెనర్జీతో చికెన్ తింటాడన్నారు. కానీ రైతుల కష్టాలు ఎవరు పరిష్కరిస్తారని జగన్ సూటిగా ప్రశ్నించారు.