లక్ష్మీపార్వతి జోస్యం : వైసీపీకి 125 ఎమ్మెల్యే , 22 ఎంపీ సీట్లు ఖాయం

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, వైసీపీకి 125కు పైగా అసెంబ్లీ సీట్లు, 19 నుంచి 22 ఎంపీ సీట్లు వస్తాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి లక్ష్మీపార్వతి అన్నారు.

  • Published By: veegamteam ,Published On : April 9, 2019 / 07:51 AM IST
లక్ష్మీపార్వతి జోస్యం : వైసీపీకి 125 ఎమ్మెల్యే , 22 ఎంపీ సీట్లు ఖాయం

Updated On : April 9, 2019 / 7:51 AM IST

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, వైసీపీకి 125కు పైగా అసెంబ్లీ సీట్లు, 19 నుంచి 22 ఎంపీ సీట్లు వస్తాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి లక్ష్మీపార్వతి అన్నారు.

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, వైసీపీకి 125కు పైగా అసెంబ్లీ సీట్లు, 19 నుంచి 22 ఎంపీ సీట్లు వస్తాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి లక్ష్మీపార్వతి అన్నారు. జాతీయ చానెళ్ల సర్వేలు, వైసీపీ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైందని లక్ష్మీపార్వతి చెప్పారు. ఏపీ ప్రజలు జగన్ వైపు ఉన్నారని ఆమె అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ మంచి మెజార్టీతో, ఓటింగ్ శాతంతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇప్పటికే టీడీపీతో పోలిస్తే వైసీపీకి 10శాతం ఓటింగ్ పెరిగిందని లక్ష్మీపార్వతి చెప్పారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనంతా మోసాలు, అబద్దాలే అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఎస్సీ, కాపుల ఓట్లు చీల్చేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని.. కేఏ పాల్ ని, పవన్ కల్యాణ్ ని రంగంలోకి దించారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా గెలుపు మాత్రం జగన్ దే అన్నారు.
Read Also : నేను జగన్‌లా కాదు : వాళ్ల బిస్కెట్లకు ఆశపడను, టీఆర్ఎస్‌లో కలవను

చంద్రబాబు మేనిఫెస్టోని ప్రజలు నమ్మడం లేదని చెప్పారు. నాయకుడు అంటే వైఎస్ లా ఉండాలని లక్ష్మీపార్వతి అన్నారు. ఏపీ ప్రజలు చాలా తెలివైన వారని, చంద్రబాబు కుట్రలను తిప్పికొడతారని లక్ష్మీపార్వతి చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో 650 హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ఇప్పుడు మరోసారి ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేసేందుకు మరో మేనిఫెస్టోతో వచ్చారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు.

​​​​​​​మరో 150 హామీలతో మేనిఫెస్టో తీసుకురావడం అంటే.. చంద్రబాబు మళ్లీ అబద్దాలు చెప్పబోతున్నారనే విషయాన్ని ప్రజలు తెలుసుకున్నారని లక్ష్మీపార్వతి చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం.. 2004లో తీసుకొచ్చిన మేనిఫెస్టోలోని అన్ని అంశాలను నెరవేర్చారని.. 2009లో మళ్లీ అదే మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చారని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు.
Read Also : 15 లక్షలు అకౌంట్స్ లో వేస్తామని ఎప్పుడూ చెప్పలేదు