Exclusive Visuals : కోడెల కారుపై వైసీపీ దాడి

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతలకు దారి తీసింది. సత్తెనపల్లిలో ఘర్షణపూరిత వాతారణం నెలకొంది. టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు కారుపై వైసీసీ కార్యకర్తలు దాడి చేశారు. కోడెల పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు ఆయన కారుని అడ్డగించారు. కారుని చుట్టుముట్టారు. కారు పైకి ఎక్కి రాళ్లతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా కారు డోరు తెరిచి డ్రైవర్, గన్ మెన్ పైనా దాడి చేశారు. వైసీపీ కార్యకర్తలు నానా బీభత్సం చేశారు.
ఈ దాడిలో డ్రైవర్ కి గాయాలు అయ్యాయి. వైసీపీ కార్యకర్తల దాడి నుంచి ఎలాగో అలా కోడెల బయటపడ్డారు. అక్కడి నుంచి కారులో పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. పోలింగ్ కేంద్రం దగ్గర కూడా కోడెలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.
ఇనుమెట్లలో దాడిపై కోడెల శివప్రసాద్ రావు స్పందించారు. పోలింగ్ బూత్ ను పరిశీలించేందుకు వెళ్తున్న తనపై కొందరు దాడి చేశారని తెలిపారు. వైసీపీ కార్యకర్తలు రాళ్లతో తన కారును ధ్వంసం చేశారని చెప్పారు. దాడి సమయంలో తాను కారులోనే ఉన్నానని తెలిపారు. డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.