ఆమంచి రాక వైసీపీలో కాక : పార్టీ వీడనున్న నేత

  • Published By: veegamteam ,Published On : February 18, 2019 / 05:54 AM IST
ఆమంచి రాక వైసీపీలో కాక : పార్టీ వీడనున్న నేత

Updated On : February 18, 2019 / 5:54 AM IST

చీరాల : సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో నేతల పార్టీలు మారే ప్రక్రియ ఆయా పార్టీలో సెగలు పుట్టిస్తున్నాయి.  టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరడంతో వైఎస్ ఆర్ లో చేరటం కొంతమంది నేతలకు మింగుడు పడటం లేదు. ఆయన వైసీపీలో  చేరి కొద్ది రోజులు కూడా గడవలేదు. అప్పుడే.. పార్టీలో బేధాభిప్రాయాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో చీరాల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆమంచి రాకను వ్యతిరేకిస్తు  యడం బాలాజీ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో తన మద్దతుదారులతో బాలాజీ  మంతనాలు మొదలుపెట్టినట్లు సమాచారం.

2014లో ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి..ప్రస్తుతం పార్టీ  సమన్వయకర్తగా పని చేస్తున్న యడం బాలాజీ ఆమంచిని పార్టీలోకి ఆహ్వానించటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆమంచితో వైసీపీ నేతలు రాయబారాలు నడుతున్నారని తెలిసినాటినుంచీ యడం పార్టీ కార్యక్రమాలకు ఎడమెహంగా ఉండటం..పార్టీలో చేర్చుకునే విషయాన్ని తనకు కనీసం మాట మాత్రంగా కూడా తెలిజేయకపోవడంపై బాలాజీ ఆనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ క్రమంలో జగన్‌ను కలిసి తన అసంతృప్తిని తెలిపారట.ఆమంచి పార్టీలో చేరడాన్ని తాను స్వాగతించనని బాలాజీ తేల్చి చెప్పినట్లుగా సమాచారం. దీంతో జగన్ పెద్దగా స్పందించకపోవటంతో బాలాజీ పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నట్లు..మరో రెండు మూడు రోజుల్లో ఈ విషయంలో అధికారిక ప్రకటన రానుందని ఆయన అనుచర వర్గాల సమచారం.