YSRCP అధికారంలోకి వస్తే : 2 లక్షల 30 వేల ఉద్యోగాల భర్తీ – జగన్

ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏయే పనులు చేస్తామో చిట్టా విప్పారు వైసీపీ అధ్యక్షుడు జగన్. ఏపీలో ఏప్రిల్ 11వ తేదీన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మార్చి 30వ తేదీ శనివారం నందికొట్కూరులో జగన్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తామన్నారు జగన్.
Read Also : ఏపీకి ఈసీ షాక్ : నిరుద్యోగ భృతి పెంచొద్దు.. ఇవ్వొద్దు
‘మొట్టమొదటగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు 2 లక్షల 30 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాను. జనవరి 1న ప్రభుత్వ ఉద్యోగ క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తా. ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటు. ఇక్కడే చదువుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే విధంగా చూస్తాం. ప్రతి 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వాలంటీర్‌గా నియామకం. వీరికి రూ. 5వేల వేతనం. ఆయా ఇళ్లల్లో నెలకొన్న సమస్యలను గ్రామ వాలంటీర్ పరిష్కరించే విధంగా చూస్తాడు. ప్రభుత్వం రూపొందించే పథకాలు నేరుగా వచ్చే అవకాశాలున్నాయి.
75 శాతం ఉద్యోగాలు లోకల్ వారికే ఇవ్వాలనే చట్టం శాసనసభలో తీసుకొస్తాం. ప్రతి జిల్లాల్లో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు. ఇక్కడ యువకులకు ఉచితంగా ట్రైనింగ్ ఇప్పించే ఏర్పాటు.
గవర్నమెంట్ కాంట్రాక్టర్‌లన్నీ నిరుద్యోగ యువతకే ఇస్తాం. పెట్టుబడి కింద సబ్సిడీ ఇస్తాం. 50 శాతం బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు సబ్సిడీ అందించే విధంగా చూస్తాం’. అని జగన్ తెలిపారు. మరి ఈ హామీలకు ప్రజలు అట్రాక్ట్ అవుతారా ? లేదా ? అనేది చూడాలి మరి.
Read Also : బాబోయ్.. బిల్లు కట్టేదెట్టా : కేబుల్, డీటీహెచ్ ఛానళ్లు వెరీ కాస్ట్‌లీ