Viral Video: లోకల్ ట్రైన్లో ఓ వ్యక్తి సర్కస్ ఫీట్లు.. స్పైడర్‌మ్యాన్ అంటున్న నెటిజెన్లు
ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘‘స్పైడర్‌మ్యాన్ ఇండియాలో కూడా ఉన్నాడు’’ అని ఒకరు.. ‘‘చాలా సరదాగా ఉంది. కానీ, అతడు అంత కష్టపడుతుంటే మనం నవ్వడం సరికాదు’’ అని మరొకరు కామెంట్ చేశారు. ఇక దేశంలో రైళ్ల పరిస్థితి గురించి స్పందిస్తూ.. దేశం ఎప్పుడు ముందుకు వెళ్తుందంటూ ప్రశ్నిస్తున్నారు.

Viral video: Man swings on handrail inside local train, netizens awed by 'Spiderman'
Viral Video: మనల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తడంలో సోషల్ మీడియా ముందుంటుంది. ఎన్నెన్నో వింతైన, విచిత్రమైన విషయాలను నెటిజెన్లు ఇతరులతో పంచుకుంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజెన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఎక్కడ జరిగిందనే విషయంపై అంతగా క్లారిటీ లేదు కానీ, లోకల్ ట్రైన్లో ఓ వ్యక్తికి ఎదురైన సంఘటనపై మాత్రం నెటిజెన్లు తెగ రియాక్ట్ అవుతున్నారు. నిజానికి అతడు సర్కస్ ఫీట్లు చేయాల్సిన దుస్థితి వచ్చింది. కానీ, నెటిజెన్లు మాత్రం అతడిని హీరో అని పొగుడుతుండడం విశేషం.
నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ట్రైన్లో కొంత మంది నిద్రపోతున్నారు. ముందుకు వెళ్లడానికి దారి లేదు. వారిని దాటి వెళ్లాల్సిన అసవరంలో ఒక వ్యక్తి ఉన్నాడు. బహుశా వారిని నిద్రలేపడం ఎందుకులే అనుకున్నాడో ఏమో.. నిల్చుకున్నప్పుడు పట్టుకోవడానికి సపోర్ట్‌గా ఉండే హ్యాండ్రేల్స్ సహాయంతో సర్కస్ ఫీట్లు చేస్తూ వారిని తప్పించుకున్నాడు. దీన్ని కాస్త సహా ప్రయాణికులు వీడియో తీసి నెట్టింట్లో వదలడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
स्पाइडरमैन भारत में। pic.twitter.com/5QNjJ8OzfP
— Professor ngl राजा बाबू ?? (@GaurangBhardwa1) October 13, 2022
ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘‘స్పైడర్‌మ్యాన్ ఇండియాలో కూడా ఉన్నాడు’’ అని ఒకరు.. ‘‘చాలా సరదాగా ఉంది. కానీ, అతడు అంత కష్టపడుతుంటే మనం నవ్వడం సరికాదు’’ అని మరొకరు కామెంట్ చేశారు. ఇక దేశంలో రైళ్ల పరిస్థితి గురించి స్పందిస్తూ.. దేశం ఎప్పుడు ముందుకు వెళ్తుందంటూ ప్రశ్నిస్తున్నారు.
HP Assembly Polls: వారసత్వ రాజకీయాలంటూ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ మరోసారి విరుచుకుపడ్డ అమిత్ షా