Bride Dancing Viral Video : తమిళ పాటకు డ్యాన్స్ చేసి జోష్ నింపిన కేరళ వధువు
సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలను చూడాలంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. అందులోని పెళ్లి కూతురు డ్రెస్‌లో ఉన్న వధువు చూడముచ్చటగా ఉంటుంది. ఇక ఆ నూతన వధువు పాటకు డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది... ఉత్సాహం ఉరకలు వేస్తుంది.

Bride Dance In Marraige Viral Video
Bride Dancing Viral Video : సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలను చూడాలంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. అందులోని పెళ్లి కూతురు డ్రెస్‌లో ఉన్న వధువు చూడముచ్చటగా ఉంటుంది. ఇక ఆ నూతన వధువు పాటకు డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది… ఉత్సాహం ఉరకలు వేస్తుంది.
ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. లాక్‌డౌన్ ఆంక్షల మధ్య ఇంటిలోనే కూర్చున్న ప్రజలు యూట్యూబ్‌లో ఉన్న వీడియోలు చూడటం అలవాటు చేసుకున్నారు. దీంతో కొన్ని వీడియోలకు విపరీమైన క్రేజ్ వస్తోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో వధువు ఎర్రచీర కట్టుకుని స్టేజి మీద డ్యాన్స్ చేస్తుంది. ఆమెకు తోడుగా మరో ఇద్దరు యువకులు కూడా స్టేజి మీదకు వచ్చి ఆమెతో పాటు డ్యాన్స్ చేసి వచ్చిన అతిధులను ఉత్సాహపరిచారు. పాట చివర్లో వధువు నల్ల కళ్లద్దాలు పెట్టుకుని డ్యాన్స్ చేసి అందరిలో మరింత జోష్ పెంచింది.
ఈఏడాది ఏప్రిల్ 7న టీజీవో వెడ్డింగ్ ఫిల్మ్స్ అనే సంస్ధ యూట్యూబ్ లో వీడియోను అప్‌లోడ్ చేసింది. అప్పటి నుంచి సుమారు 38,36,889 మంది ఈవీడియోను తిలకించారు.