Fall Fashion: కింద పడిపోయే ఫ్యాషన్.. హొయలొలుకుతూ నడుస్తూ వచ్చి పడిపోయిన ముద్దుగుమ్మలు.. వీడియో వైరల్
ఎంత పొడవాటి దస్తులు ధరించినా, ఎంత బిగుతైన, పొట్టి డ్రెస్సులు వేసుకుని నడుస్తున్నా మోడల్స్ కిందపడిపోరు. ఒకవేళ ఇలా నడుస్తూ ఎవరైనా పడిపోయారో అందరూ గొల్లుమని నవ్వుతుంటారు. ఆ మోడళ్ల పరువు పోయిందని భావిస్తారు. అయితే, తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ బీటె కార్ల్సన్ కొత్త ఫ్యాషన్ వీక్ షో ‘‘అవావవ్’’లో మాత్రం ర్యాంప్ పై నడిచిన భామలు అందరూ కిందపడిపోయారు. వారు జారిపోయి పడ్డారనుకుంటే పొరపాటే. నడుస్తూ జారిపడినట్లు నటించడమే ఈ షో స్పెషల్.

Fall Fashion
Fall Fashion: ఫ్యాషన్ షో అనగానే ముద్దుగుమ్మలు హంస నడకలతో వచ్చి మనల్ని కళ్లు తిప్పికోనివ్వకుండా చేసే దృశ్యాలే గుర్తుకొస్తాయి. హొయలు ఒలుకుతూ నడుస్తూ చూపరులను మోడల్స్ ఆకట్టుకుంటారు. ఆ క్రమంలో ఒక్క తప్పటడుగు కూడా వేయరు. ఎంత పొడవాటి దస్తులు ధరించినా, ఎంత బిగుతైన, పొట్టి డ్రెస్సులు వేసుకుని నడుస్తున్నా మోడల్స్ కిందపడిపోరు. ఒకవేళ ఇలా నడుస్తూ ఎవరైనా పడిపోయారో అందరూ గొల్లుమని నవ్వుతుంటారు. ఆ మోడళ్ల పరువు పోయిందని భావిస్తారు.
అయితే, తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ బీటె కార్ల్సన్ కొత్త ఫ్యాషన్ వీక్ షో ‘‘అవావవ్’’లో మాత్రం ర్యాంప్ పై నడిచిన భామలు అందరూ కిందపడిపోయారు. వారు జారిపోయి పడ్డారనుకుంటే పొరపాటే. నడుస్తూ జారిపడినట్లు నటించడమే ఈ షో స్పెషల్. ఈ షోను చూడడానికి వచ్చిన వారందరూ మొదట షాక్ అయ్యారు. అందరూ ఇలా పడిపోతున్నారేంటని అనుకున్నారు.
ఆ తర్వాత ఇది కొత్తరకం షో అని గుర్తించి చప్పట్లు కొట్టారు. రకరకాల ఫ్యాషన్ల దుస్తులతో మోడల్స్ నడుస్తూ వచ్చి కిందపడిపోతారు. ముద్దుగుమ్మలు గ్రే, పింక్, వైట్ ఇతర రంగుల కొత్త రక దుస్తులు ధరించి ఇందులో పాల్గొన్నారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయని, వాటిని సమానంగా చూడాలని చెప్పడానికి డైరెక్టర్ బీటె కార్ల్సన్ రొటీన్ కి భిన్నంగా ఈ షో నిర్వహించారు. ఆయన సృజనాత్మకత వల్ల ఇప్పుడు ఈ షో అందరి దృష్టిలో పడింది.
View this post on Instagram
Rain alert for Telangana: తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం