హెయిర్ కట్ సరిగ్గా చేయలేదని.. ఏడుస్తూ పోలీసులకు కంప్లైంట్ చేసిన 10ఏళ్ల బాలుడు

10 Year Old Boy Bursts Into Tears Calls The Police After Receiving A Bad Unsatisfactory Haircut
హెయిర్ కట్ బాగా లేకపోతే ఎంత బాధపడుతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పిల్లలు అయితే తోటివారి చేత వెక్కిరింపబడుతారని ఎక్కువ బాధపడుతుంటారు. హెయిర్ కట్ బాగా చెయ్యకపోతే మానసిక స్థితి తీవ్రంగా పాడవుతుంది. అలా హెయిర్ కట్ బాగా చెయ్యలేదనే బాధతో ఓ పదేళ్ల బాలుడు.. చైనాలో ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు చేసిన కటింగ్ బాగాలేదని, సంతృప్తికరంగా లేదంటూ గట్టిగా ఏడుస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నార్త్ చైనాలోని గుయిజౌలో బాలుడు తన జుట్టు సరిగ్గా కత్తిరించలేదంటూ.. క్షురకునిపై తీవ్రమైన కోపంతో పెద్దగా కేకలు వేస్తూ, జుట్టుపై చేతులను నిరంతరం కదిలిస్తూ చూపిస్తూ.. బార్బర్ షాప్ వద్దకు వచ్చిన పోలీసులను పిలిచి కంప్లైంట్ చేశాడు. పోలీసులు ఏం చెయ్యలేకపోవడంలో బాలుడు ఒప్పుకోలేదు..
దీంతో పోలీసులు బాలుడి అక్కను బాలునికి సర్ధిచెప్పాలని బతిమాలగా.., ఆమె బాలుడికి పోలీసులు చిన్న విషయాలను పట్టించుకోరని చెబుతుంది. తన సోదరుడు కేశాలంకరణ గురించి ఎప్పుడూ చాలా ప్రత్యేకంగా చెబుతాడని, అందుకే సరిగ్గా కటింగ్ రాకపోవడంతో బాధపడ్డాడని చెప్పుకొచ్చారు. ఈ వీడియో చైనాలో వైరల్ అవుతోంది. బాలుడి చర్యలను చూసి నవ్వుకుంటున్నారు.