చోటా బాహుబలి: నిమిషంలో 125 టైల్స్ పగలగొట్టిన ఐదేళ్ల బాలుడు

  • Published By: veegamteam ,Published On : December 17, 2019 / 05:40 AM IST
చోటా బాహుబలి: నిమిషంలో 125 టైల్స్ పగలగొట్టిన ఐదేళ్ల బాలుడు

Updated On : December 17, 2019 / 5:40 AM IST

నాగపూర్ కు చెందిన ఓ 5 ఏళ్ల బాలుడు ఎంత సాహసం చేశాడు తెలుసా. కేవలం ఒక్క నిమిషంలో 125 టైల్స్‌ ను చేతులతో పగలగొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. రాఘవ్ సహిల్ భంగ్డే అనే ఈ బాలుడు తొలి ప్రయత్నంతోనే అందరి మనసులు దోచుకున్నాడు.

బెరార్ హైస్కూల్‌ లో ఆదివారం (డిసెంబర్ 15, 2019)న ఈ ప్రయత్నం నిర్వహించారు. ఇందుకు స్కూల్‌ వేదికపై 150 టైళ్లను ఏర్పాటు చేశారు. అయితే రాఘవ్ అందులో నుంచి 125 టైళ్లను విజయవంతంగా పగలగొట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. 

ఈ సందర్భంగా అతని కోచ్ విజయ్ మాట్లాడుతూ.. రాఘవ్ త్వరలోనే 150 టైళ్లను పగలగొట్టి రికార్డును బద్దలు కొడతాడని తెలిపారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.