వైరల్ వీడియో: పెట్టెల కొద్దీ సిగిరెట్లు తాగేస్తున్న కుక్క..! : చైన్ స్మోకర్స్‌ని మించిపోయింది..!! 

  • Published By: veegamteam ,Published On : December 31, 2019 / 07:13 AM IST
వైరల్ వీడియో: పెట్టెల కొద్దీ సిగిరెట్లు తాగేస్తున్న కుక్క..! : చైన్ స్మోకర్స్‌ని మించిపోయింది..!! 

Updated On : December 31, 2019 / 7:13 AM IST

ఓ కుక్క సిగిరెట్లను తెగ తాగేస్తోంది. గుప్పు గుప్పుమంటూ పెట్టెల కొద్దీ సిగిరెట్లను కాల్చేస్తోంది. పొగరాయుళ్లను మించిపోయింది. అచ్చు మనిషిలాగా..సిగిరెట్ తాగి..ముక్కుల వెంట పొగను యమా స్టైల్ గా వదులుతోంది. దీన్ని చూస్తే ఏందిరా..ఈ కుక్కేంది మనకు పోటీగా వచ్చింది అనుకుంటారు పొగరాయుళ్లు. సిగిరెట్ తాగుతు పొగను ముక్కుల్లోంచి స్టైల్ గా వదులుతున్న ఈ కుక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ కుక్క సిగరెట్ తాగడం చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. సిగిరెట్ కాల్చేటప్పుడు దాని హావభావాలు చూసి ఏమి ఫోజురా బాబు అనుకుంటున్నారు. 
 
చక్కగా దర్జాగా కూర్చుంది. సిగిరెట్ పెట్టెను పక్కనే ఉంచుకుంది. ఓ సిగిరెట్ ను ముందు కాళ్లు వేళ్ల మధ్యలో పెట్టుకుంది. వంగి సిగిరెట్ ను తాగుతూ..పొగను స్టైల్ గా ముక్కుల్లోంచి వదులుతోంది. ఏదో పొగగొట్టంలోంచి వచ్చినట్లుగా ఈ కుక్క ముక్కుల్లోంచి సిగిరెట్ పొగ గుప్పు గుప్పు మంటూ వదులుతోంది.  

కాలితో సిగరెట్ కాల్చి, ముక్కులో నుంచి పొగ వదులుతున్న విధానం చూసి చైన్ స్మోకర్లు కూడా షాక్ అవుతున్నారు. నోరెళ్లబెట్టి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో వాట్సాప్ స్టేటస్ లు గా పెట్టారు కొందరు. ఇక వీడియో వెనుక ఒక తెలుగు సినిమా పాటను జోడించారు కొందరు. ‘‘ఆగదు ఏ నిమిషము నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము అంటూ పాటను జోడించారు. పాపం ఆ కుక్కు ఎం బాధలు ఉన్నాయో…? ఎన్ని బాధలు ఉన్నాయో.. ప్రేమించిన ఆడ కుక్క వదిలేసింది ఏమో అంటూ కామెంట్లు చేస్తూ కుక్క వీడియో ని విపరీతంగా షేర్ చేస్తున్నారు. మరి చైన్ స్పోకర్ డాగ్ పై మీరు కూడా ఓ లుక్కేయండి..