పుట్ బాల్ ఆడుతున్న జింక… ఏం షాట్లు కొడుతుందిరా బాబు

సాధారణంగా మనుషులు మాత్రమే ఆడే ఆటలను మూగ జంతువులు కూడా ఆడుతున్నాయి. ఒక జింక పుట్ బాల్ గేమ్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా ఆ వీడియోను గురువారం(జనవరి 2,2020) తన ట్విటర్ లో పోస్ట్ చేశారు.
అసలు విషయం ఏమిటంటే జింక ఒక పార్కులో తన కోమ్ములతో పుట్ బాల్ గేమ్ లో గోల్ కొడుతూ కనిపించింది. జింక ఒంటరిగా ప్రత్యర్థి లేకుండా గోల్ కొట్టి , లక్ష్యాన్ని సాధించింది. లక్ష్యం సాధించిన ఆనందంతో జింక పరుగులు తీసింది. దీని ద్వారా చిన్న అడుగులు రేపటి విజయాన్ని కారణం అవుతాయినే పాఠాన్ని అర్ధం అవుతుంది.
సుశాంత్ నందా ఎదురుగా ప్రత్యర్థి లేకపోయినప్పటికీ కూడా లక్ష్యాన్ని సాధించడంలో ఎల్లప్పుడూ సంతోషం ఉంటుందనే క్యాప్షన్ తో వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో నెటిజన్లు చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇది ఒక అద్భుతం, లక్ష్యాలను సాధించడం అనేది సంతోషాన్నికి దారి తీస్తుందని కొంత మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Always be happy in achieving ur goal, even if there was no opponent in front ???? pic.twitter.com/VhpU0ECzxt
— Susanta Nanda IFS (@susantananda3) January 2, 2020