‘జూ’లో జంతువుల కోసం క్రిస్మస్ ట్రీలు.. ఎందుకంటే?

  • Published By: veegamteam ,Published On : January 6, 2020 / 06:34 AM IST
‘జూ’లో జంతువుల కోసం క్రిస్మస్ ట్రీలు.. ఎందుకంటే?

Updated On : January 6, 2020 / 6:34 AM IST

జర్మనీ రాజధాని బెర్లిన్‌ లో రెండు ‘జూ’లు ఉన్నాయి. అందులో ఒకటి టైయర్ పార్క్. ఈ జూ అధికారులకు వచ్చిన కొత్త ఆలోచన బలే ఉంది. అదేంటంటే.. క్రిస్మస్ పండుగ కోసం తెచ్చి అమ్ముడు కాకుండా మిగిలిపోయిన క్రిస్మస్ ట్రీలను వేర్వేరు షాపుల్లో కొని… జూకి తీసుకొచ్చారు. వాటికి రొట్టెలు, పండ్లను సెట్ చేశారు. 

ఆ ట్రీస్‌ ని జూలో ఏనుగులు, కోతులు, ఇతర జంతువులు ఉండే చోట ఉంచారు. ప్రజల నుంచీ ఇలాంటి చెట్లను తీసుకోలేదు. ఎందుకంటే… చెట్లను వారు డెకరేట్ చేస్తారు కాబట్టి… కెమికల్స్ ఉంటాయనే ఉద్దేశంతో వాటిని తీసుకోలేదు. షాపుల నుంచీ తెచ్చిన చెట్లలో కొన్నింటిని ఏనుగులకు, మరికొన్నిటిని కోతులకు, ఒంటెలకు, పులులకు ఇచ్చారు. 

అయితే ట్రీ స్ ఇస్తే అవేం చేసుకుంటాయని మీరు అనుకుంటున్నారు కదా..? చెట్లు మాత్రమే కాందండి.. చెట్లకు తోడుగా వాటిపై పండ్లు, స్నాక్స్ కుచ్చి అక్కడ పెట్టారు. దీంతో అవి ఖుషీ అయిపోయాయి. ఇక పులుల కోసం అవే చెట్లకు మాంసాన్ని డెకరేట్ చేసి ఇచ్చారు. పులులు కూడా ఫుల్ హ్యాపీగా ఆ మాంసాన్ని తినేశాయి. ఇలా క్రిస్మస్ ట్రీస్ వేస్ట్ కాకుండా చక్కగా ఉపయోగించారు. వాటిని చూసి  జూకి వచ్చే సందర్శకులు, టూరిస్టుల ప్రశంసలు పొందుతున్నారు అధికారులు.