5వేల సంవత్సరాల తర్వాత బయటపడ్డ సిటీ

ప్రజల మనుగడకు దూరంగా వేల సంవత్సరాలుగా కంటికి కనిపించిన నగరమొకటి శాస్త్రవేత్తలకు దర్శనమిచ్చింది. ఇజ్రాయెల్ దేశంలో ఈ అద్భుతం వెలుగు చూసింది. దీనిని కాంస్య యుగం నాటి నగరంగా గుర్తించారు. అప్పటి కోటలు, కోట బురుజులు, దేవాలయం, స్మశానం, వస్తువులు, పనిముట్లు బయటపడ్డాయి.
వారికి పరిశోధనలో కనిపించిన జంతువుల ఎముకలు అప్పటి బలి సంస్కృతిని ప్రతిబింబిస్తున్నట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘సుమారు 5వేల సంవత్సరాల నాటి ఎన్ఎష్యూర్ నగరాన్ని కనుగొన్నాం. 0.65చదరపు కిలోమీటర్లలో ఇది విస్తరించి ఉంది. విశాలమైన రహదారులు, వీధులు ఇందులో ఉన్నాయి’
‘ఆ కాలంలో సిటీ డెవలప్‌మెంట్‌ను ఈ నగరంతోనే ముందు నిర్మించినట్లు భావిస్తున్నాం. సుమారు ఐదారు వేల మంది ఇక్కడ వ్యవసాయం, వాణిజ్యం చేసుకుంటూ జీవనం సాగించేవారని తెలుస్తోంది. క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో ప్రజలు ఈ నగరాన్ని విడిచిపెట్టినట్లు అంచనా వేస్తున్నాం’ అని ఇజ్రాయెల్ పురాతత్వ వస్తువుల ప్రాధికార సంస్థ అధికారి ఇజాక్ పాజ్ తెలిపారు.