టీడీపీ పసుపు-కుంకుమ యాడ్ పై ట్రోలింగ్ : ఎద్దు పాలిస్తుందట..

అమరావతి : ఏపీలో ఎన్నికల హడావిడి మామూలుగా లేదు. ప్రతీ పార్టీ తమ ప్రచారాన్ని చేసుకుంటున్న క్రమంలో అధికార పార్టీ ‘పసుపు-కుంకుమ’ పథకం ప్రకటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ..పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార టీడీపీ, విపక్ష వైసీపీ, బీజేపీల మధ్య మాటలయుద్ధం ముదురుతోంది. తాజాగా ‘పసుపు-కుంకుమ’ పథకంపై టీడీపీ పార్టీ రూపొందించిన యాడ్ ను టార్గెట్ చేస్తు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ప్రకటనలో ఎద్దును ఆవుగా చూపెట్టారని ఎద్దేవా చేస్తు ప్రతిపక్ష పార్టీలు ఈ ట్రోలింగ్ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
అసలు టీడీపీ నేతలకు ఎద్దుకు, ఆవుకు తేడా తెలియడం లేదా? అని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. నమ్మిన ఆడపడచుకు కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఎద్దేవా చేస్తున్నారు. కాగా, టీడీపీ విడుదల చేసిన ప్రచార వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ మహిళ ఆవు (ఎద్దు) దూడను తీసుకుని వీధిలో నుంచి లోపలికి వస్తుండగా..ఆమె భర్త ఆశ్చర్య చూస్తు ఈ ఆవు దూడ ఏంటి అని అడుగుతాడు.దాని ఆమె మా అన్న కొనిచ్చాడు..అనంటే నీకు అన్న లేరుకదా అంటే మా చంద్రన్న పసుపు-కుంకుమ కింది ఇచ్చిన రూ.10వేలతో ఈ ఆవు దూడను కొన్నాననీ..ఇకనుంచి ఇంటి బాధ్యత మీది..పాప బాధ్యత నాది అంటుంది. ఈ యాడ్ కు సంబంధించిన వీడిలో ఆవు స్థానంలో ఉన్నది ఎద్దు అని ఆ మాత్రం అధికార పార్టీకి తెలియలేదా అంటు ట్రోలింగ్ చేస్తున్నారు.