పుట్టిన 28నిమిషాల తర్వాత శ్వాస.. ఆపై పోరాడి గెలిచింది

పుట్టిన 28నిమిషాల తర్వాత శ్వాస.. ఆపై పోరాడి గెలిచింది

Updated On : September 9, 2019 / 10:32 AM IST

సాధారణంగా అప్పుడే పుట్టిన పసికందు ఏడుస్తుంటే అందరికళ్లలో సంతోషం కనిపిస్తుంది. ఆ తల్లి పురిటినొప్పులను సైతం మరిచిపోయి హాయిగా నవ్వుకుంటుంది. అనూహ్యంగా పుట్టిన 28నిమిషాల వరకూ శ్వాస అందుకోకుండా ఉన్న పాపను చూసి ఉన్న అక్కడున్న వాళ్లంతా భయంతో హడలెత్తారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ప్రాణాలతో పోరాడింది ఆ చిన్నారి. 

ఎట్టకేలకు సంవత్సరం పూర్తి చేసుకుని ఆరోగ్యంగా ఉంది. ఇవా అనే పాప పుట్టిన నిమిషాల వరకూ శ్వాస తీసుకోలేదు. పరిస్థితి ప్రతికూలంగా ఉండడంతో నార్తబ్రియా స్పెషలిస్ట్ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పేరెంట్స్ అలెక్స్ కెల్లీ, మార్క్‌లను ముందుగానే హెచ్చరించారు డాక్టర్లు. తమ వంతు ప్రయత్నం చేస్తామని కాపాడగలమనే గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే పర్మినెంట్‌గా బ్రెయిన్ డేమేజ్ కూడా అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు వారించారు. ఇంక్యూబేటర్లలో ఉంచి చికిత్స అందిస్తున్న కొద్ది రోజుల వరకూ ఎటువంటి స్పందనా లేదు. క్రమంగా కోలుకున్న పాప 2018 జూన్ 30న కోలుకుని తల్లిదండ్రులతో పాటు ఇంటికి వెళ్లింది. గదిలో ఉష్ణోగ్రతను తగ్గించడంతో పాప శరీరం 41శాతం నుంచి 28శాతానికి తగ్గడంతో ఆరోగ్యంగా ఉంచగలిగామని వైద్యులు తెలిపారు.