విమానంలో హల్ చల్ చేసిన పావురం.. వీడియో వైరల్

  • Published By: veegamteam ,Published On : February 29, 2020 / 08:35 AM IST
విమానంలో హల్ చల్ చేసిన పావురం.. వీడియో వైరల్

Updated On : February 29, 2020 / 8:35 AM IST

అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ గోకు చెందిన G-8702 విమానంలో శనివారం (ఫిబ్రవరీ 29, 2020) ఉదయం ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. అదేంటంటే.. టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానం సరిగ్గా టేకాఫ్ అయ్యే సమయానికి ఒక్కసారిగా ఎక్కడి నుంచి ఓ పావురం రివ్వున విమానంలోకి వచ్చింది.

దీంతో ప్రయాణికులంతా ముందుగా కొంచెం టెన్షన్ పడ్డా తర్వాత దానితో నవుకుంటూ ఎంజాయ్ చేశారు. కొందరైతే దాన్ని పట్టుకునేందుకు కూడా ప్రయత్నించారు. మరికొందరు మహిళలు మాత్రం టెన్షన్ పడ్డారు. ఇంకొందరు ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

కాసేపటికి క్యాబిన్ క్రూ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. వారు వచ్చి విండో క్యాబిన్ ఓపెన్ చేసి పావురాన్ని బయటకు పంపించారు. ఈ పావురం కారణంగా విమానం అరగంట ఆలస్యమైంది. ఇక ప్రయాణికులు వీడియోని సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ వీడియో కాస్త వైరల్ అవుతోంది.