వైరల్ అవుతున్న ప్రధాని ట్విట్టర్ ప్రొఫైల్ పిక్..

వైరల్ అవుతున్న ప్రధాని ట్విట్టర్ ప్రొఫైల్ పిక్..

Updated On : June 23, 2021 / 4:42 PM IST

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 14, 2020న లాక్‌డౌన్ మే 3 వరకు పొడిగించినట్లు ప్రకటించారు. ప్రసంగం మొదలుపెట్టడానికి ముందు మోడీ మాస్క్‌తో ముఖాన్ని కవర్ చేసుకున్నారు. ప్రసంగం తరవాత తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్చర్ ని మార్చారు. మాస్క్ ధరించిన ఫోటోను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నారు.

ప్రధాని మోడీ ప్రొఫైల్ పిక్ ఇప్పుడు ప్రజల్లో ఆసక్తి రేపుతోంది. మాస్క్ లేదంటే ఇంట్లో తయారుచేసిన వాటిని చాలామంది ట్విట్టర్లో షేర్ చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రజలందరినీ మాస్కులు ధరించమని ప్రభుత్వం ఎప్పటి నుంచో సూచిస్తుంది.  ఇప్పుడు అదే అర్ధంతో మోడీ ప్రొఫైల్ పిక్ మార్చి ప్రజలకు మాస్క్ ధరించమని చెబుతున్నట్లు అందరూ భావిస్తున్నారు.

ఈ క్రమంలో పీఎం నరేంద్రమోడీకి మద్దతుగా నా ప్రొఫైల్ పిక్‌ను మార్చానంటూ… ఎంపీ మనోజ్ తివారీ ట్విట్ చేసాడు. అంతేకాదు మరొక ట్విట్టర్ యూజర్ ప్రవీణ్ అగర్వాల్ అనే వ్యక్తి కూడా మాస్క్ ధరించి ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ… It’s a New Challenge అని పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలలో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక ఇండియాలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పది వేలు దాటింది. 350 మందికి పైగా ఈ వైరస్ కారణంగా మరణించారు.