Narsingi PHC : సెల్‌ఫోన్ టార్చ్‌లైట్ వెలుతురులో డెలివరీ

హైదరాబాద్ నగర శివారులోని  నార్సింగి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో విద్యుత్  సరఫరాలలో అంతరాయం కలగటంతో  చీకటిలోనే  కాన్పులు  చేస్తున్న ఘటన వెలుగు చూసింది.

Narsingi PHC : సెల్‌ఫోన్ టార్చ్‌లైట్ వెలుతురులో డెలివరీ

Narsingi Phc

Updated On : July 11, 2021 / 4:25 PM IST

Narsingi PHC : ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెపుతున్నప్పటికీ  కొన్ని ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కరవవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగర శివారులోని  నార్సింగి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో విద్యుత్  సరఫరాలలో అంతరాయం కలగటంతో  చీకటిలోనే  కాన్పులు  చేస్తున్న ఘటన వెలుగు చూసింది.

నార్సింగి ప్రాధమిక  ఆరోగ్య కేంద్రంలో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ఈ ఆస్పత్రికి రోజు పదుల సంఖ్యలో గర్భిణీలు డెలివరీ కోసం వస్తుంటారు. గంటల తరబడి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండటంతో గర్భిణీలు నరకయాతన అనుభవిస్తున్నారు.

అప్పుడు  పుట్టిన  పిల్లలు గాలిలేక ఉక్కపోతతో అల్లాడి పోతున్నారు. ఆస్పత్రిలో ఇన్‌వర్టర్ ఉన్నప్పటికీ అదీ రిపేరులో ఉంది. సరైన నిధులు లేకపోవటంతో దాన్ని పక్కకు పడేశారు. శనివారం డెలివరి నిమిత్తం వచ్చిన ఓ మహిళ బంధువులు సెల్ ఫోన్  టార్చిలైట్   వెలుతురులో డెలివరీ చేస్తున్న సిబ్బంది ఫోటోలను ఎవరో  తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.